హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI: సెప్టెంబర్ 22 నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్ల పరిస్థితేంటి?

RBI: సెప్టెంబర్ 22 నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్ల పరిస్థితేంటి?

సెప్టెంబర్ 22 నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్ల పరిస్థితేంటి?

సెప్టెంబర్ 22 నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కస్టమర్ల పరిస్థితేంటి?

Bank License Cancel | బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Co-operative bank | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థల లైసెన్స్‌ను రద్దు చేస్తూ వచ్చింది. ఇటీవలనే మరో బ్యాంక్ లైసెన్స్ (Bank License) కూడా రద్దు చేసింది. ఆగస్ట్ నెలలో రూపీ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ నెలలో ఈ బ్యాంక్ సేవలు బంద్ కానున్నాయి. రానున్న రోజుల్లో ఈ బ్యాంక్ కస్టమర్లకు కనిపించదు. సెప్టెంబర్ 22 నుంచి బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.

  బ్యాంక్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో కస్టమర్లు డబ్బులు డిపాజిట్ చేయడం లేదంటే విత్‌డ్రా చేసుకోవడం వంటివి చేయలేరు. బ్యాంక్ వద్ద సరిపడినంత మూలధనం లేకపోవడం, అలాగే ఆదాయ అంచనాలు లేకపోవడం వంటి అంశాల కారణంగా లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. ఆర్‌బీఐ ప్రకారం చూస్తే.. రూపీ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 11 (1), సెక్షన్ 22 (3)(డీ), సెక్షన్ 56 నిబంధనలను అతిక్రమించింది. అలాగే సెక్షన్ 22 (3)(ఏ), 22 (3) (బీ), 22 (3)(సీ), 22 (3)(డీ), 22(3)(ఇ) నిబంధనలు కూడా ఉల్లంఘించింది.

  ఎస్‌బీఐలో అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్

  ఇకపోతే బ్యాంక్ కనుమరుగు అవుతున్న నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్లకు అందరికీ డీఐసీజీసీ యాక్ట్ ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. అందువల్ల డబ్బులు పెట్టిన వారికి ఇబ్బిం లేదు. ప్రతి ఒక్క డిపాజిట్ దారుడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కింద రూ. 5 లక్షల వరకు లభిస్తుంది. అంటే రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసిన వారికి వారి డబ్బులు పూర్తిగా వెనక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అంటే రూ. 50 వేలు పెట్టిన వారికి పూర్తి డబ్బులు వస్తాయి. అలాగే రూ. 4 లక్షలు పెట్టిన వారికి కూడా వారి డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

  గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? దీని వెనక అంత పెద్ద కారణం ఉందా?

  అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకున్న వారికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే రూ. 5 లక్షలకు పైన డబ్బులు డిపాజిట్ చేసి ఉంటే మాత్రం.. అప్పుడు వారికి రూ. 5 లక్షల వరకే డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే చాలా కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది. పలు ఇతర ఆర్థిక సంస్థల లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేసింది. రూల్స్ అతిక్రమణ ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Bank account, Banks, Rbi, Reserve Bank of India

  ఉత్తమ కథలు