RBI: ఆ విషయంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంకును దాటేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్...

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరికొత్త రికార్డు నెల‌కొల్పింది. ప్రపంచలోనే అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా అవతరించింది.

news18-telugu
Updated: November 23, 2020, 12:30 AM IST
RBI: ఆ విషయంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంకును దాటేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఫైల్ ఫొటో)
  • Share this:
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్‌లో ఫాలోయర్ల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బిఐ. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో 1 మిలియన్ మంది ఫాలోయర్లతో, రిజర్వ్ బ్యాంక్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్, మరియు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌ను అధిగమించింది. అయతే రిజర్వ్ బ్యాంక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో లభించిన సమాచారం ప్రకారం, 2020 సెప్టెంబర్ 27 న ఫాలోయర్ల సంఖ్య 9.66 లక్షలు, ఇది ఇప్పుడు 10 లక్షలు మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆదివారం ట్వీట్ చేస్తూ, "రిజర్వ్ బ్యాంక్ ట్విట్టర్ ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య ఈ రోజు 10 లక్షల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్‌లోని నా సహోద్యోగులందరికీ అభినందనలు". అని తెలిపారు.

ఇదిలా ఉంటే  యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2009 మార్చిలో ట్విటర్‌లో చేరగా.. ఈసీబీ 2009 అక్టోబర్‌లో చేరింది. అయితే గత 85 ఏండ్లుగా సేవలందిస్తున్న ఆర్‌బీఐ మాత్రం జనవరి 2012లో ట్విటర్‌ ఖాతా తెరిచింది.

ప్రారంభంలో ఆర్‌బీఐ ట్విట్ట‌ర్‌ ఖాతాను అనుసరించేవారు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మార్చి 2019 నుంచి మార్చి 2020 మధ్య కాలంలో ఫాలోవర్ల సంఖ్య 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు చేరింది. కేవలం మార్చి 25 లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 1.5 లక్షలకు పైగా పెరిగింది. తాజా ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల మంది కొత్తగా ఈ ఖాతాకు ఫాలోయర్లుగా చేరారు.
Published by: Krishna Adithya
First published: November 23, 2020, 12:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading