రిలయన్స్ భాగస్వామ్యంతో రేమండ్ ‘ఎకోవీరా’

R | Elan గ్రీన్ గోల్డ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన నవతరం ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన ఫ్యాబ్రిక్‌ను ఇది తయారు చేస్తుంది

news18-telugu
Updated: April 10, 2019, 8:01 PM IST
రిలయన్స్ భాగస్వామ్యంతో రేమండ్ ‘ఎకోవీరా’
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 8:01 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం R|Elan సహకారంతో రేమండ్ కొత్తరకం వస్త్రాలను తయారు చేసింది. ‘ఎకోవీరా’ పేరుతో రూపొందించిన ఈ దుస్తులు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. దేశంలోని 700 నగరాల్లోని 1500 స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫైబర్‌ అయిన R|Elan గ్రీన్ గోల్డ్‌ తో వీటిని తయారు చేశారు. పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేసిన తర్వాత దానికి బయో ఇంధనాలు కలిపి ప్రాసెస్ చేసి గ్రీన్ గోల్డ్‌ను తయారు చేస్తారు. సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌తోపాటు మనుషులు తయారు చేసే అద్భుతమైన ప్యాబ్రిక్‌‌తో రేమండ్ వస్త్రాలను తయారు చేస్తోందని, ఇప్పుడు మరింత కొత్తగా పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) వస్త్రాలు తయారు చేయడం ఆనందంగా ఉందని రేమండ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ (టెక్స్‌టైల్స్) సుధాన్షు పోక్రియాల్ తెలిపారు. R|Elan గ్రీన్ గోల్డ్‌ అనేది ఒక అత్యున్నతమైన పర్యావరణహిత లక్ష్యానికి ముందడుగు అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాబ్రిక్‌ను రేమండ్స్ తయారు చేస్తోంది. ఉన్నతశ్రేణి ఫ్యాబ్రిక్ మార్కెట్‌లో 60శాతం వాటా రేమండ్స్‌దే.

రేమండ్ ఎకోవీరా


R | Elan గ్రీన్ గోల్డ్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన నవతరం ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ హితమైన ఫ్యాబ్రిక్‌ను ఇది తయారు చేస్తుంది. ఓ వైపు పర్యావరణహితంతో పాటు మరోవైపు ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కస్టమర్లు, మేజర్ బ్రాండ్స్ మన్ననలు పొందుతుంది.

‘రేమండ్‌తో భాగస్వామ్యం కావడం గర్వకారణం. పర్యావరణానికి ఏమైనా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉన్నతమైన ఫ్యాబ్రిక్, ఫ్యాషన్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా వస్త్రాలు తయారు చేయడానికి R | Elan గ్రీన్ గోల్డ్ తోడ్పడుతుంది.’ అని గుంజన్ శర్మ (సీఎంఓ, పాలిస్టర్ బిజినెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్) తెలిపారు. చెత్త నుంచి పర్యావరణహితమైన ఉత్పాదనలు తయారుచేయడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ కృషి చేస్తోంది.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...