హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ration Card Rules: వారంతా రేషన్ కార్డ్ వెనక్కి ఇచ్చేయాలి... రూల్స్ తెలుసుకోండి

Ration Card Rules: వారంతా రేషన్ కార్డ్ వెనక్కి ఇచ్చేయాలి... రూల్స్ తెలుసుకోండి

Ration Card Rules: వారంతా రేషన్ కార్డ్ వెనక్కి ఇచ్చేయాలి... రూల్స్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Ration Card Rules: వారంతా రేషన్ కార్డ్ వెనక్కి ఇచ్చేయాలి... రూల్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Ration Card Rules | రేషన్ కార్డ్ విషయంలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు. రేషన్ కార్డ్ నిరుపేదలు, దారిద్ర్య రేఖకు (Below Poverty Line) దిగువన ఉన్నవారికి ఇస్తారు. కొందరు వ్యక్తులు రేషన్ కార్డ్ ఉపయోగించకూడదు.

ఇంకా చదవండి ...

ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి ఆహార భద్రత కోసం రేషన్ కార్డుల్ని (Ration Cards) ఇస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో రేషన్ కార్డులు లక్షలాది మంది నిరుపేదల్ని ఆదుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డ్ హోల్డర్లకు రేషన్ షాపుల (Ration Shops) ద్వారా నిరుపేదలకు సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించాయి. అయితే రేషన్ కార్డ్ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అర్హతలు లేకపోయినా రేషన్ కార్డు పొందినా, ఉపయోగించినా చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనర్హులు రేషన్ కార్డుల్ని ఉపయోగిస్తున్నట్టైతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. మరి రేషన్ కార్డ్ రూల్స్ ఏంటీ? ఏ సందర్భాల్లో రేషన్ కార్డ్ రద్దవుతుంది? తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డుల్నే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అని పిలుస్తారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం ఈ కార్డుల్ని జారీ చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు, అర్బన్ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు వార్షికాదాయం ఉన్నవారు రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు. రూ.3.5 ఎకరాల లోపు పంటపొలాలు, రూ.7.5 ఎకరాల లోపు బీడు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు.

Akshaya Tritiya Offers: రేపే అక్షయ తృతీయ... ఉచితంగా గోల్డ్ కాయిన్ పొందండి ఇలా

ఇక ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ రూల్స్ చూస్తే అర్బన్ ప్రాంతాల్లో రూ.75,000 లోపు వార్షికాదాయం, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60,000 లోపు వార్షికాదాయం ఉన్నవారు రేషన్ కార్డ్ తీసుకోవచ్చు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డ్ పొందడానికి అర్హులు.

ఇక 100 చదరపు మీటర్ల ప్లాట్, ఇల్లు, ఫ్లాట్, ఫోర్ వీలర్, కార్, ట్రాక్టర్, రూ.2 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి రేషన్ కార్డ్ ఇవ్వరు. ఒకవేళ వారు రేషన్ కార్డ్ ఉపయోగిస్తున్నట్టైతే తహసీల్దార్ ఆఫీసులో సరెండర్ చేయాలి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ లాంటి ప్రొఫెషనల్స్ కూడా తమ దగ్గర రేషన్ కార్డ్ ఉంటే సరెండర్ చేయాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ పేయర్స్, సేల్స్ ట్యాక్స్ పేయర్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు కూడా రేషన్ కార్డ్ సరెండర్ చేయాల్సి ఉంటుంది.

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... ప్రతీ నెలా రూ.10,000 ఆదాయం

గతంలో రేషన్ కార్డ్ తీసుకొన్నవారు ఆర్థికంగా స్థిరపడినట్టైతే తమ రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు, దారిద్రరేఖకు దిగువన ఉన్నవారి కోసం రేషన్ కార్డుల్ని ఇస్తోంది ప్రభుత్వం. కాబట్టి ఆర్థికంగా స్థిరపడ్డవారు తమ రేషన్ కార్డును సరెండర్ చేయాలి.

First published:

Tags: Ration card, Ration cards, Ration Shop

ఉత్తమ కథలు