హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న.. ఇప్పుడిదే ట్రెండింగ్.. ఆయన ఏమన్నరంటే..

Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న.. ఇప్పుడిదే ట్రెండింగ్.. ఆయన ఏమన్నరంటే..

రతన్ టాటా (File)

రతన్ టాటా (File)

సోషల్ మీడియా జరుగుతున్న 'భారత రత్న' ప్రచారంపై రతన్ టాటా స్వయంగా స్పందించారు. దయచేసి ప్రచారాన్ని ఆపాలని నెటిజన్లలకు విజ్ఞప్తి చేశారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానని.. అంతకు మించి తనకు ఏమీ వద్దని ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి ...

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా (Ratan TATA)కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆయనను భారతరత్నతో సత్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రతన్ టాటాకు భారతరత్న పేరిట హ్యాష్ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. డాక్టర్‌ వివేక్‌ భింద్రా అనే ఓ మోటివేషనల్‌ స్పీకర్‌ శుక్రవారం రతన్‌ టాటా గురించి ఓ ట్వీట్‌ చేశారు. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా చేసిన సేవలకు గానూభారత రత్న పురస్కారం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆయనకు భారత రత్న రావలని కోరుకునే వారు #BharatRatnaForRatanTata హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు, పోస్ట్‌లు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వేలాది మంది ట్వీట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం రతన్ టాటాతో నిండిపోయింది.

సోషల్ మీడియా జరుగుతున్న ఈ క్యాంపెయిన్‌పై రతన్ టాటా స్వయంగా స్పందించారు. దయచేసి ప్రచారాన్ని ఆపాలని నెటిజన్లలకు విజ్ఞప్తి చేశారు. దేశానికి సేవ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తానని.. అంతకు మించి తనకు ఏమీ వద్దని ట్వీట్ చేశారు.

''నాకు అవార్డు ఇవ్వాలంటూ సామాజి మాధ్యమాల్లో కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. అయితే ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని వారిని సవినయంగా కోరుతున్నా. వీటన్నింటి కంటే నేను భారతీయుడిని అవడం.. దేశ వృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను.'' అని రతన్ టాటా పేర్కొన్నారు.


రతన్ టాటాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా చాలా సింపుల్‌గా ఉంటారు. దాన, ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు. తన సామాజిక సేవా కార్యక్రమాల కారణంగా భారతీయుల్లో హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గత ఏడాది కరోనా సమయంలో పీఎం కేర్స్‌కు రూ.1500 కోట్ల విరాళం అందజేశారు. ఇలా ఎప్పుడు ఆయన అవసరం వచ్చినా సాయం చేసేందుకు ముందుంటారు రతన్ టాటా. ఆయన సేవలకుగాను 2000లో పద్మభూషణ్, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం తస్కరించింది. ఐతే ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.

First published:

Tags: Bharat Ratna, Business, Ratan Tata

ఉత్తమ కథలు