మన దేశంలో పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటా (Ratan Tata). ఈ వయసులో కూడా ఆయన సోషల్ మీడియా(Socail Media)లో లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ యాక్టివ్‌గా ఉంటారు. ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్‌కు భారత్‌లో ఆయన బాటలు వేశారు. టాటా బ్రాండ్‌ను ఎక్కువ మంది ఇండియన్స్‌కు చేరువ చేశారు. అయితే టాటా గ్రూపు నుంచి భారత్‌లో రిలీజ్ అయిన మొదటి పాసింజర్ కారు ‘టాటా ఇండికా’ను విడుదల చేసి 25 ఏళ్లు అయింది. ఈ ఐకానిక్ కార్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నానంటూ రతన్ టాటా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశంలోని ప్యాసింజర్ కార్ సెగ్మెంట్‌లో ఇండికాను ప్రారంభించి అప్పట్లో ఆయన ట్రెండ్ సెట్ చేశారు.
రతన్ టాటా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ టాటా ఇండికా(Tata Indica) కారుతో ఉన్న తన ఫోటోను షేర్ చేశారు. కొంత కాలం క్రితం తీయించుకున్న పాత ఫోటో అది. ‘ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, టాటా ఇండికా (Tata Indica)ను లాంచ్ చేయడం, భారతదేశ స్వదేశీ ప్యాసింజర్ కార్ల పరిశ్రమకు పుట్టుక లాంటిది. ఇది మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది’ అనే క్యాప్షన్‌ను ఫోటోకు యాడ్ చేశారు.
* నెటిజన్ల రెస్పాన్స్
రతన్ టాటా షేర్ చేసిన ఈ లేటెస్ట్ పోస్టుకు లైక్‌ల వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు నలభై లక్షల మందికి పైగా యూజర్లు దాన్ని లైక్ చేశారు. చాలామంది టాటా ఇండికా వినియోగదారులు ఆ కారుతో తమకున్న అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేశారు.
* టాటా ఇండికా ప్రస్థానం
భారత దేశంలో ప్యాసింజర్ సెగ్మెంట్‌లో తయారైన మొదటి కారు టాటా ఇండికానే. దీన్ని టాటా మోటార్స్ సంస్థ 1998లో తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది బడ్జెట్ కార్ల విభాగంలో మంచి ఆదరణ సంపాదించుకుంటూ వచ్చింది. కాపాక్ట్‌గా చిన్నగా ఉండే ఈ కారు ధర కూడా అంతే అందుబాటులో ఉండేది. దీంతో విడుదలైన రెండేళ్లలోనే ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది.
View this post on Instagram
అయితే 2018లో టాటా మోటార్స్ ఈ హ్యాచ్‌బ్యాక్ తయారీని నిలిపివేసింది. అంటే ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన 20 ఏళ్ల తర్వాత, సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సెగ్మెంట్‌లో మరింత అడ్వాన్స్‌డ్, ప్రీమియం మోడళ్లు అందుబాటులోకి రావడంతో ఇండియా ప్రొడక్షన్స్‌ను కంపెనీ ఆపేసింది. తర్వాత మరిన్ని కొత్త మోడళ్లు, కొత్త ఫీచర్లతో కార్ల తయారీలో టాటా మోటార్స్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Ratan Tata, Tata cars