RATAN TATA OFFERS TIPS TO ENTREPRENEURS FOR CREATING PERFECT PITCH DECK MS
స్టార్టప్ ఆలోచనలో ఉన్నారా? మీకోసం టాటా అద్భుత సలహా..
రతన్ టాటా (File Photo)
తాజాగా ఇన్‌స్టాలో టాటా చేసిన ప్రతిపాదన ఒకటి చాలామందికి విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అది చాలా ఉపయోగకరంగా ఉంది.
పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరి కొద్ది రోజులే అయినా.. దాదాపు 7లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇన్‌స్టాలో టాటా పోస్ట్ చేసే ఫోటోలు, ఆయన పంచుకునే అనుభవాలు, అభిప్రాయాలు చాలామందిని ఆకట్టుకునే రీతిలో ఉంటాయి. అందుకే అంతమంది ఫాలోవర్స్‌ను పొందడానికి ఆయనకు పెద్దగా టైమ్ పట్టలేదు. తాజాగా ఇన్‌స్టాలో టాటా చేసిన ప్రతిపాదన ఒకటి చాలామందికి విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అది చాలా ఉపయోగకరంగా ఉంది. ఏ స్టార్టప్‌కి అయినా పెట్టుబడులు రావాలంటే.. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్) అసవరం.ఆకట్టుకునే టెంప్లెట్.. ప్రాజెక్టుకు సంబంధించి కూలంకషమైన వివరాలు.. అన్నీ అందులో పొందుపరచాలి. ఇన్వెస్టర్స్‌కు ఆ ప్రెజేంటేషన్ చూడగానే నచ్చాలి. కాబట్టి చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక ప్రహసనం.దీనిపై ఫోకస్ చేసిన టాటా.. దాన్ని సులభతరం చేసేందుకు తమ సంస్థ రూపొందించిన ఒక టెంప్లెట్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై పోల్ నిర్వహించగా.. 97శాతం మంది నెటిజెన్స్ ఆ టెంప్లేట్ తమకు నచ్చిందని అభిప్రాయపడ్డారు.
స్టార్టప్స్ మొదలుపెట్టాలనుకునే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మీలో చాలామందే ఉన్నారు. కానీ మీలాంటివారు తరుచూ అడిగే ప్రశ్న.. మొదటి అడుగు ఎలా వేయాలని..? మీ లాంటి వారి కోసం మా సంస్థ సహకారంతో ఒక టెంప్లెట్ రూపొందించాం. స్టార్టప్స్ ఆలోచనలో ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీ ఆలోచనలన్నీ ఒక్క చోట పెట్టేందుకు ఇది అనువుగా ఉంటుంది.
— రతన్ టాటా,పారిశ్రామికవేత్త
టాటా పోస్ట్ చేసిన ఆ టెంప్లెట్లో 'ఏ సమస్యను మీ స్టార్టప్ పరిష్కరిస్తుంది','ఎంచుకున్న సమస్యకు పరిష్కార మార్గమేమిటి','మార్కెట్లో పోటీదారులను తట్టుకుని మీ ప్రొడక్ట్ ప్రత్యేకంగా ఎలా నిలబడుతుంది',ఎంత ఖర్చవుతుంది' వంటి విభాగాలన్నీ అందులో ఉన్నాయి. మొత్తంగా ఒక స్టార్టప్ ఏర్పాటుకు కావాల్సిన కసరత్తు మొత్తం ఈ టెంప్లెట్ ద్వారా చేసేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.