హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా

Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Business Idea: లక్షల్లో ఆదాయం వచ్చే వ్యాపారం... రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకోండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Business Idea | కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? రతన్ టాటా పెట్టుబడి పెట్టిన ఓ కంపెనీ ఫ్రాంఛైజీల ద్వారా అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. ఎక్కువమంది వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలనుకుంటే భారీగా పెట్టుబడి కావాలి. కానీ లక్ష రూపాయలు ఉన్నా వ్యాపారం చేయొచ్చు. అలాంటి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్న సంస్థ జనరిక్ ఆధార్. వ్యాపార దిగ్గజం రతన్ టాటా భారీగా పెట్టుబడి పెట్టిన సంస్థ ఇది. జనరిక్ డ్రగ్ స్టార్టప్. ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకొని లక్షల్లో సంపాదించొచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టి మెడికల్ స్టోర్ ఓపెన్ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు. ఈ వ్యాపారం గురించి తెలుసుకోండి.

పెట్టుబడి ఎంత?


జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజ్ తీసుకోవడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కేవలం రూ.1,00,000 పెట్టుబడి చాలు. ఎవరైనా జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజీని రూ.1,00,000 పెట్టుబడితో ఓపెన్ చేయొచ్చు. ఇందులో 40 శాతం వరకు మార్జిన్స్ వస్తాయి. ఈ కంపెనీ 1000 రకాల జనరిక్ మెడిసిన్స్ అందిస్తాయి. ఈ మెడిసిన్‌పై కస్టమర్లకు 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఆన్‌లైన్‌లో మెడిసిన్ ఆర్డర్ చేసే సదుపాయం కూడా ఉంది. మీరు ఉంటున్న ప్రాంతానికి చెందినవారు ఎవరైనా జనరిక్ ఆధార్ ప్లాట్‌ఫామ్‌లో మెడిసిన్ ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ మీకు వస్తుంది. మీరు మెడిసిన్ డెలివరీ చేయడం ద్వారా లాభం పొందొచ్చు. జనరిక్ ఆధార్ సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ కంపెనీ ఫ్రాంఛైజ్ తీసుకొని ముంబై, ఉత్తర్ ప్రదేశ్‌లోని వ్యాపారులు నెలకు రూ.8,00,000 నుంచి రూ.10,00,000 వరకు ఆదాయం పొందుతున్నారు. ప్రాంతాన్ని బట్టి లాభం మారొచ్చు.

Business Idea: స్మార్ట్‌ఫోన్‌తో ఆన్‌లైన్ బిజినెస్... నెలకు రూ.30,000 ప్రాఫిట్... మీరూ చేయొచ్చు ఇలా

Online Business: రూ.12 లక్షల పెట్టుబడితో వ్యాపారం... ఏటా రూ.100 కోట్ల టర్నోవర్

ఫ్రాంఛైజ్ ఎలా తీసుకోవాలి?


ఇప్పటికే మెడికల్ షాప్ ఉన్నవారు లేదా కొత్తగా మెడికల్ షాప్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నవారు జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజ్ తీసుకోవచ్చు. ఈ ఫార్మసీతో వ్యాపారం చేసేవారితో పాటు కస్టమర్లకు కూడా లాభమే. మీరు ఈ ఫ్రాంఛైజ్ తీసుకుంటే కంపెనీ నుంచి జనరిక్ ఆధార్ బ్రాండ్ లోగో లభిస్తుంది. ఇన్-హౌజ్ సాఫ్ట్‌వేర్, బ్రాండింగ్ మెటీరియల్, ఇన్-హౌజ్ ప్రొడక్ట్స్, మెడిసిన్ లాంటివి లభిస్తాయి. మీరు డ్రగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ సహకారం ఉంటుంది.

జనరిక్ ఆధార్ సంస్థ ఎవరిది?


యువ వ్యవస్థాపకుడైన అర్జున్ దేశ్‌పాండే జనరిక్ ఆధార్ సంస్థను ప్రారంభించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో జనరిక్ మెడిసిన్ అమ్మే ప్లాట్‌ఫామ్ ఇది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లోని 130 పట్టణాల్లో జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజీలు ఉన్నాయి. వ్యాపార ప్రపంచానికి పరిచయం అక్కర్లేని వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఈ ఫార్మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం విశేషం.

PAN Card: అలర్ట్... ఈ 18 ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డ్ తప్పనిసరి

Gas Cylinder offer: గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.900 క్యాష్‌బ్యాక్... మూడుసార్లు ఆఫర్ పొందండి ఇలా

జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజ్ ఎలా తీసుకోవాలి?


మీరు కూడా జనరిక్ ఆధార్ ఫ్రాంఛైజ్ తీసుకోవాలనుకుంటే https://genericaadhaar.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Business Opportunity పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, సిటీ పేరు ఎంటర్ చేయాలి. వెబ్‌సైట్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేసి ఫ్రాంఛైజ్ వివరాలు తెలుసుకోవచ్చు.

First published:

Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Business plan, Business secrets, Business woman, Businessman, Good business, Online business, Small business

ఉత్తమ కథలు