హోమ్ /వార్తలు /బిజినెస్ /

Spicejet: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి... ఫ్లైట్లు ఆలస్యం

Spicejet: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి... ఫ్లైట్లు ఆలస్యం

Spicejet: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి... ఫ్లైట్లు ఆలస్యం
(image: Spicejet)

Spicejet: స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి... ఫ్లైట్లు ఆలస్యం (image: Spicejet)

Spicejet Airlines | స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన కొన్ని ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. ఈ సైబర్ దాడి (Cyber Attack) రాత్రి జరిగినట్టు స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.

భారతదేశంలో విమాన సర్వీసుల్ని అందిస్తున్న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై (Spicejet Airlines) అర్ధరాత్రి సైబర్ దాడి జరిగింది. దీంతో మే 25 ఉదయం కొన్ని ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌పై రాన్సమ్‌వేర్ ఎటాక్ (Ransomware Attack) జరిగింది. "కొన్ని స్పైస్‌జెట్ సిస్టమ్స్ గత రాత్రి రాన్సమ్‌వేర్ దాడిని ఎదుర్కొన్నాయి. ఆ ప్రభావం కారణంగా ఈరోజు ఉదయం బయలుదేరే విమానాలు ఆలస్యం అయ్యాయి. మా ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దింది. ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి" అని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

అయితే ఈ రాన్సమ్‌వేర్ ఎటాక్‌కు సంబంధించిన ఇతర వివరాలను స్పైస్‌జెట్ వెల్లడించలేదు. రాన్సమ్‌వేర్ ఎటాక్ అంటే సైబర్ నేరగాళ్లు సిస్టమ్స్‌పై దాడి చేసి, సిస్టమ్‌ను స్తంభింపజేస్తారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే సిస్టమ్‌లోని ముఖ్యమైన ఫైల్స్ డిలిట్ చేస్తామని బెదిరిస్తారు. డబ్బులు ఇస్తేనే సిస్టమ్స్‌ని అన్‌లాక్ చేసి యథాతథంగా పనిచేసేలా చేస్తారు. ఇలాంటి దాడిని రాన్సమ్‌వేర్ ఎటాక్ అని పిలుస్తారు. ఇదే తరహా సైబర్ దాడి స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌పై జరిగింది.

SBI Offers: కొత్త కార్ కొంటున్నారా? ఎస్‌బీఐ నుంచి రూ.25,000 వరకు బెనిఫిట్స్

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సిస్టమ్స్‌పై సైబర్ దాడి కారణంగా విమానాలు మూడు గంటలకు పైగానే ఆలస్యం అయినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. మూడు గంటల 45 నిమిషాలుగా విమానంలోనే ఉన్నామని, ఫ్లైట్ క్యాన్సిల్ చేయట్లేదని, అలాగని ఆపరేట్ కూడా చేయట్లేదని, ఎయిర్‌పోర్టులో కాకుండా ఫ్లైట్‌లో కూర్చోబెట్టారని, కనీసం బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇవ్వలేదని, ఎవరూ స్పందించట్లేదని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశారు. వీడియో కూడా పోస్ట్ చేశారు.

సోఫోస్ నివేదిక ప్రకారం 2021లో 78 శాతం భారతీయ సంస్థలు రాన్సమ్‌వేర్ ఎటాక్ బారినపడ్డాయి. 2020 లో ఇది 68 శాతం మాత్రమే ఉండేది. ఈ సంస్థ సర్వే ప్రకారం ఇలాంటి దాడుల్లో సగటున 1,198,475 అమెరికన్ డాలర్లు అంటే రూ.9 కోట్లకు పైనే చెల్లించారని తేలింది. 10 శాతం మంది బాధితులు 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అంటే సుమారు రూ.7 కోట్ల కంటే ఎక్కువ చెల్లించారు.

Jio Plans: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఐపీఎల్ ఫైనల్ ఫ్రీగా చూడండి

గతేడాది 78 శాతం సంస్థలపై సైబర్ దాడి చేసి డేటాను ఎన్‌క్రిప్ట్ చేశారు సైబర్ నేరగాళ్లు. అయితే ఆయా సంస్థల దగ్గర బ్యాకప్‌తో పాటు ఇతర రికవరీ మార్గాలు ఉన్నా, తమ డేటాను తిరిగి పొందడానికి డబ్బులు చెల్లించాయి.

First published:

Tags: Airlines, Cyber Attack, SpiceJet

ఉత్తమ కథలు