Gold Rate: తులం బంగారం ధర రూ.78,000 వైపు అడుగులు...?

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1500 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2500-3000 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. ఈ లెక్కన దేశీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు రూ.78000 తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అంచనా వేశారు.

Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 3:30 PM IST
Gold Rate: తులం బంగారం ధర రూ.78,000 వైపు అడుగులు...?
ఫ్రతీకాత్మక చిత్రం
Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 3:30 PM IST
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1500 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2500-3000 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా వేశారు. ఈ లెక్కన దేశీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు రూ.78000 తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన అంచనా వేశారు. అందుకే తాను ఈక్విటీ మార్కెట్ తో పాటు బంగారంపై కూడా పెట్టుబడి పెడుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాకేష్ ఝున్ ఝున్ వాలా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బంగారం ధరలు రికార్డు స్థాయి వరకూ ఎగిసి అక్కడి నుంచి పతనం అవ్వడం ప్రారంభించాయి.

ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు చూసినట్లయితే హైదరాబాద్ లో 24 కేరట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.39432గా పలుకుతోంది. అదే సమయంలో ముంబైలో తులం బంగారం ధర రూ.39439గా పలుకుతోంది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఫెస్టివల్ సీజన్ లో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...