రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన పోర్ట్ ఫోలియాలో వాటాలు పెంచుకున్న షేర్లు ఇవే...

ఓ వైపు మార్కెట్లు నష్టాల ఒత్తిడిలో నీరు గారి పోతున్నప్పటికీ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్ వాలా మాత్రం ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థల్లో తన పెట్టుబడులు పెంచుకుంటూ పోతున్నారు.

news18-telugu
Updated: July 23, 2019, 3:35 PM IST
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన పోర్ట్ ఫోలియాలో వాటాలు పెంచుకున్న షేర్లు ఇవే...
రాకేష్ ఝున్ ఝున్ వాలా( ఫైల్ చిత్రం)
  • Share this:
దేశీయ మార్కెట్లలో బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తన పోర్ట్ ఫోలియోలో రెండు కంపెనీల్లో  వాటాలను పెంచుకున్నారు. ఓ వైపు మార్కెట్లు నష్టాల ఒత్తిడిలో నీరు గారి పోతున్నప్పటికీ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్ వాలా మాత్రం ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థల్లో తన పెట్టుబడులు పెంచుకుంటూ పోతున్నారు. జూన్ క్వార్టర్ ముగింపు సందర్భంగా రాకేష్ ఝన్‌ఝన్‌వాలా పోర్ట్ ఫోలియా వైపు ఒక లుక్ వేస్తే..స్పైస్ జెట్, టైటాన్ కంపెనీల్లో ఆయన వాటాలు పెంనుచుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఫెడరల్ బ్యాంక్, లుపిన్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు తగ్గించుకున్నారు.

జూలై 19న ఝున్ ఝున్ వాలా తన పోర్ట్ ఫోలియోలోని షేర్ హోల్డింగ్స్ లోని ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ డేటాను విడుదల చేశారు. అందులో దాదాపు సగానికి పైగా స్టాక్స్ నెగిటివ్ రిటర్న్ ఇవ్వడం గమనార్హం. అయితే ఈ సారి ఏస్ ఇన్వెస్టర్ తన పోర్ట్ ఫోలియోలోని స్పైస్ జెట్, టైటాన్ కంపెనీల్లో వాటాను పెంచుకున్నారు. స్పైస్ జెట్ లో మార్చ్ క్వార్టర్ లో 1.25 శాతం ఉండగా, జూన్ క్వార్టర్ లో మాత్రం 1.67 శాతానికి పెంచుకున్నారు. అయితే తొలిక్వార్టర్ లో స్పైస్ జెట్ ఏకంగా 58.07 శాతం రిటర్న్ ఇచ్చింది. ఇక టైటాన్ కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీల్లో కూడా గత క్వార్టర్ తో పోలచ్చితే 0.1 శాతం వాటాను పెంచుకొని 7.05 శాతం హోల్డింగ్స్ కలిగి ఉన్నారు. కాగా ఆయనకు ఈ క్వార్టర్ లో టైటాన్ కంపెనీ 17.28 శాతం లాభాలను పంచింది.

ఇక రాకేష్ పోర్ట్ ఫోలియోలో అత్యంత నష్టాలు పంచిన కంపెనీగా దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిలిచింది. కంపెనీలో ఆయన వాటాను 3.19 శాతం నుంచి 2.46 శాతానికి తగ్గించుకున్నారు. కాగ దీవాన్ హౌసింగ్ దెబ్బకు ఈ క్వార్టర్ లో ఆయన ఏకంగా -78.61 శాతం నష్టపోయారు. అక అలాగే లుపిన్ లో సైతం 1.93 శాతం నుంచి 1.73 శాతానికి వాటాలను ఉపసంహరించుకున్నారు. ఇక రాకేష్ పోర్ట్ ఫోలియోలో ఈ క్వార్టర్‌లో భారీ నష్టాలు మిగిల్చిన స్టాక్స్ చూస్తే మంధానా రిటైల్ వెంచర్స్ (-71.37 శాతం), ప్రకాశ్ ఇండస్ట్రీస్ (-41.42 శాతం), డెల్టా కార్ప్ (-38.08 శాతం), జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-37.37 శాతం) నష్టపోయారు.

rakesh jhunjhunwala,rakesh jhunjhunwala portfolio,rajesh jhunjhunwala,rakesh jhunjhunwala story,rakesh jhunjhunwala biography,rakesh jhunjhunwala latest interview,rajesh jhunjhunwala latest buying,rakesh jhunjhunwala hindi,rakesh jhunjhunwala penny stock,rakesh jhunjhunwala trading tips,rakesh jhunjhunwala portfolio 2018,rakesh jhunjhunwala latest portfolio 2018,rakesh jhunjhunwala 2016,rakesh jhunjhunwala film
ఝున్ ఝున్ వాలా పోర్ట్ ఫోలియో


First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>