RAKESH JHUNJHUNWALA HAS INCREASED CONFIDENCE IN THIS MULTIBAGGER STOCK OF TATA GROUP INCREASED STAKE MK
Rakesh Jhunjhunwala Portfolio Share: రాకేష్ జున్ జున్ వాలా ఈ TATA స్టాక్ లో తన వాటాలను పెంచుకున్నారు..మీరు ఓ లుక్కేయండి...
Rakesh Jhunjhunwala
Rakesh Jhunjhunwala Portfolio Share: పట్టిందల్లా బంగారం అని పేరుతెచ్చుకున్న ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌లో తన వాటాను స్వల్పంగా 0.07 శాతం పెంచుకున్నారు.
Rakesh Jhunjhunwala Portfolio Share: పట్టిందల్లా బంగారం అని పేరుతెచ్చుకున్న ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌లో తన వాటాను స్వల్పంగా 0.07 శాతం పెంచుకున్నారు. ఈ సమాచారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడైంది. ఎక్స్ఛేంజీలలో అప్డేట్ చేయబడిన షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం, టాటా మోటార్స్‌కి చెందిన 3,92,50,000 షేర్లతో పాటు రాకేష్ జున్‌జున్‌వాలా 1.18 శాతం వాటాను కలిగి ఉన్నారు. సెప్టెంబర్ త్రైమాసికం నాటికి, ప్రముఖ ఇన్వెస్టర్ టాటా మోటార్స్‌లో 3,67,50,000 షేర్లతో పాటు 1.11 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేరు 2.68 శాతం క్షీణించి రూ.510.95 వద్ద ముగిసింది. గత ఒక సంవత్సరంలో, స్టాక్ పెట్టుబడిదారులకు దాదాపు 100% రాబడిని ఇచ్చింది. కాగా అంతకుముందు రోజే టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 19, 2022 నుండి అమలులోకి వచ్చే వేరియంట్, మోడల్ ఆధారంగా ధరలు సగటున 0.9 శాతం పెంచారు.
ఇదిలా ఉంటే చిప్ కొరత కారణంగా టాటా మోటార్స్, దాని JLR యూనిట్ చాలా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు చిప్ కొరతతో ప్రభావితమయ్యాయి. సెమీకండక్టర్ కొరతతో నిరంతరం పోరాడుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం కంపెనీ ఇంతకు ముందు పేలవమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్ యాజమాన్యం దీనిపై స్పందిస్తూ “ చిప్ కొరతను అంచనా వేయడం కష్టం. అయినప్పటికీ, మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సరఫరా మెరుగుపడుతుందని ఆశిస్తున్నామని తెలిపింది.
ఐసీఐసీఐ సెక్యూరిటీ లక్ష్యాన్ని పెంచింది
ఇదిలా ఉంటే దేశీయ బ్రోకరేజ్ సంస్థ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ టాటా మోటార్స్‌కు కొనుగోలు (BUY) రేటింగ్ ఇచ్చింది. రూ.653 టార్గెట్ నిర్ణయించింది. కాగా రాకేశ్ జున్‌జున్‌వాలా కుటుంబ సభ్యుల నికర కాపిటల్ విలువ రూ.22,300 కోట్లు. గతేడాది ఆయన సంపదలో అనూహ్యంగా 52 శాతం పెరుగుదల నమోదైంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.