Home /News /business /

RAKESH JHUNJHUNWALA DEATH LIQUOR CONSUMPTION SMOKING FOOD HABITS ARE THE MAIN REASON FOR HIS DEATH SK

Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతికి ఈ మూడు అలవాట్లే కారణమా?

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతికి ప్రధాన కారణం.. ఆయన తన ఆరోగ్యానికి పట్టించుకోకపోవడమే. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు మంచి అలవాట్లు లేవని.. అన్నీ దురలవాట్లే ఉన్నాయని పేర్కొన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు ఒక్కరోజు ముందు భారత వ్యాపార రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) మృతి చెందారు. 62 ఏళ్ల వయసున్న ఆయన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జి అయ్యారు. ఐతే ఆదివారం ఉదయం 06.45 సమయంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

  ఐతే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతికి ప్రధాన కారణం.. ఆయన తన ఆరోగ్యానికి పట్టించుకోకపోవడమే. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు మంచి అలవాట్లు లేవని.. అన్నీ దురలవాట్లే ఉన్నాయని పేర్కొన్నారు. పొగగొట్టంలా సిగరెట్లు కాల్చుతానని.. చేపలు నీళ్తు తాగినట్లుగా తాను మద్యం తాగుతానని.. ఒక పందిలా ఆహారం తింటానని... ఆయనే చెప్పారు. కనీస వ్యాయామం కూడా చేయనని గత ఇంటర్వ్యూల్లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుకే తన ఆరోగ్యం కొంత ఆందోళన ఉందని అన్నారు. తన వ్యాపరంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన ఆయన.. ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. ధూమపానం, మద్యపానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే గుండెపోటుతో ఇవాళ ఉదయం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణించారు.  రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రపంచానికి ఆయన చెరగని సహకారాన్ని అందించారంటూ కొనియాడారు. దేశ పురోగతికి కృషి చేశాడన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు మోదీ. రాకేశ్ మృతి పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ యువతకు, ఇన్వెస్టర్లకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.

  రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ‘బిగ్ బుల్’, ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు. ఆయన ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టారంటే..ఆ కంపెనీ షేర్లు భారీగా పెరుగబోతున్నాయన్న అంచనాలు అందరిలోనూ ఉండేవి. స్టాక్ మార్కెట్‌లో అంతగా ఆరితేరారు. ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆయన ఎంతో పేరుగడించారు. కేవలం 5వేల రూపాయల పెట్టుబడితో.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరిగా రాకేశ్ ఝున్‌ఝున్‌వాల నిలిచారు. ఈ మధ్య ఆకాశ పేరుతో ఎయిర్‌లైన్స్ కంపెనీని కూడా స్థాపించారు. ఆగస్టు 8న ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ నుంచి తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణించింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ తొలి విమానంలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కూడా ప్రయాణించారు. కానీ ఆ తర్వాత ఆరు రోజుల్లోనే ఆయన మరణించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, BUSINESS NEWS, Rakesh Jhunjhunwala, Share Market Update, Stock Market

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు