హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: బండి నడుపుతున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోండి

New Rules: బండి నడుపుతున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోండి

New Rules: బండి నడుపుతున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: బండి నడుపుతున్నారా? కొత్త రూల్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Motor Vehicles Amendment Bill 2019 | అత్యవసర సమయాల్లో వైద్యపరంగా, ఇతర పద్ధతుల్లో సాయం చేసినవారికి ఎలాంటి వేధింపులు ఎదురుకాకుండా కేంద్రం భరోసా ఇవ్వనుంది. అంతేకాదు... రోడ్డు ప్రమాదాల బాధితులకు గోల్డెన్ హవర్‌లో ఉచితంగా చికిత్స ఇవ్వాలన్న నిబంధనను చేర్చింది.

ఇంకా చదవండి ...

బండి తీసుకొని రోడ్డెక్కుతున్నారా? ఓవర్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌ని పెద్దగా పట్టించుకోవట్లేదా? జరిమానాలు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నారా? జర జాగ్రత్త. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. నిబంధనలు మారబోతున్నాయి. జరిమానాలూ పెరగబోతున్నాయి. రవాణా రంగంలో అవినీతిని అరికట్టడం, ప్రయాణికులకు, వాహనదారులకు భద్రత కల్పించడం, ఇందుకోసం సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసింది. వీటికి ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లులోని ముఖ్యాంశాలేంటో తెలుసుకోవడం వాహనదారులకు అవసరం. అవేంటో తెలుసుకోండి.


రోడ్డు భద్రత: వాహనదారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... ట్రాఫిక్ నియమనిబంధనల్ని ఉల్లంఘించినవారిపై భారీగా జరిమానాలు విధించనుంది. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ ఓవర్ లోడ్ లాంటి తప్పులకు జరిమానాలు భారీగా పెంచబోతోంది. ఈ జరిమానాలు రూ.2,000 నుంచి రూ.10,000 వరకు ఉండబోతున్నాయి. అంతేకాదు... ఈ జరిమానాలు ఏటా 10% పెరగబోతున్నాయి.


Motor Vehicle Amendment Bill 2019, motor vehicle bill 2019, new traffic fines, Traffic Violations, list of new challans, indian traffic rules, మోటార్ వాహనాల చట్టం 1988, మోటార్ వాహనాల సవరణ బిల్లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, కొత్త ట్రాఫిక్ ఫైన్స్, ట్రాఫిక్ రూల్స్ జరిమానాలు, ట్రాఫిక్ నిబంధనలు
ప్రతీకాత్మక చిత్రం


వాహనం ఫిట్‌నెస్: రవాణా శాఖలో అవినీతిని తగ్గించేందుకు ఆటోమెటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ తప్పనిసరి చేయబోతోంది. భద్రత, పర్యావరణ సంబంధమైన నిబంధనల్ని ఉల్లంఘించినవారికీ భారీగా జరిమానాలు విధించబోతోంది. అంతేకాదు... పర్యావరణానికి హాని చేసే వాహనాలను రీకాల్ చేయాలన్న నిబంధన కూడా ఉంది.


ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి భరోసా: సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి ముందుకు రావడానికి సంకోచిస్తుంటారు ప్రజలు. పోలీసు కేసులు, ఇతర తలనొప్పులు ఉంటాయన్న భయం ఉంటుంది. ఇందుకోసం ఈ బిల్లులో కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది కేంద్రం. అత్యవసర సమయాల్లో వైద్యపరంగా, ఇతర పద్ధతుల్లో సాయం చేసినవారికి ఎలాంటి వేధింపులు ఎదురుకాకుండా కేంద్రం భరోసా ఇవ్వనుంది. అంతేకాదు... రోడ్డు ప్రమాదాల బాధితులకు గోల్డెన్ హవర్‌లో ఉచితంగా చికిత్స ఇవ్వాలన్న నిబంధనను చేర్చింది.


థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్: ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ విధానం సులభతరం కాబోతోంది. బీమా సంస్థలు నెల లోపే క్లెయిమ్ సెటిల్ చేయాలి. హిట్ అండ్ రన్ కేసులో చనిపోయినవారి కుటుంబాలకు కనీస పరిహారాన్ని రూ.25,000 నుంచి రూ.లక్షలకు పెంచింది. తీవ్రంగా గాయపడేవారికి పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.50,000 చేసింది.


Motor Vehicle Amendment Bill 2019, motor vehicle bill 2019, new traffic fines, Traffic Violations, list of new challans, indian traffic rules, మోటార్ వాహనాల చట్టం 1988, మోటార్ వాహనాల సవరణ బిల్లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, కొత్త ట్రాఫిక్ ఫైన్స్, ట్రాఫిక్ రూల్స్ జరిమానాలు, ట్రాఫిక్ నిబంధనలు
ప్రతీకాత్మక చిత్రం


ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్: ఇక ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్ పొందొచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి. నకిలీ డ్రైవింగ్ లైసెన్సులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. లైసెన్స్ ల్యాప్స్ కావడానికి ఏడాది ముందు నుంచే రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ ట్రైనింగ్ స్కూళ్లనూ ఏర్పాటు చేయబోతోంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయబోతోంది.


ఇక కొత్త జరిమానాలు ఎలా ఉండబోతున్నాయో, పాత జరిమానాలతో పోలిస్తే ఎంత పెరుగుతుందో తెలుసుకోవడానికి ఈ చార్ట్ చూడండి.

 సెక్షన్ లేదా తప్పు పాత జరిమానా కొత్త ఫైన్
 సాధారణ జరిమానా రూ.100 రూ.500
 రహదారి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన (177A) రూ.100 రూ.500
 టికెట్ లేకుండా ప్రయాణం (178) రూ.200 రూ.500
 అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం(179) రూ.500 రూ.2000
 లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఉపయోగించడం (180) రూ.1000 రూ.5000
 లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం (181) రూ.500 కొత్త ఫైన్ రూ.5000
 అర్హత లేకుండా డ్రైవింగ్ చేయడం (182) రూ.500 రూ.10,000
 వాహనాలపై ఎక్కువ లోడ్ వేయడం (182B) రూ.5000
 ఓవర్ స్పీడ్ (183) రూ.400 చిన్న వాహనాలకు రూ.1000, మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ.2000
 ప్రమాదకరంగా డ్రైవ్ చేయడం(184) రూ.1,000 రూ.5000 వరకు
 డ్రంకెన్ డ్రైవింగ్ రూ.2000 రూ.10,000
 రేసింగ్ (189) రూ.500 రూ.5,000
 పర్మిట్ లేని వాహనాలు(192A) రూ.5000 వరకు రూ.10,000 వరకు
 సీట్ బెల్ట్ (194 B) రూ.100 రూ.1,000
 ఎమర్జెన్సీ వాహనాలకు (అంబులెన్స్) దారి ఇవ్వక పోవడం (194E) రూ.10,000
 టూవీలర్‌పై ఓవర్ లోడింగ్ (194 C) రూ.100 రూ.2,000. ఫైన్‌తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు
 ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవింగ్ (196) రూ.1,000 రూ.2,000
 ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కించుకోవడం (194A) అదనంగా ఉన్న ఒక్కో ప్యాసింజర్‌కు రూ.1000


Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:


Post Office Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా ఆదాయం


LIC Plan: రోజుకు రూ.29... రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్... ఇంకెన్నో లాభాలు


Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే

First published:

Tags: TRAFFIC AWARENESS

ఉత్తమ కథలు