ఈ రోజుల్లో చాలా ఇండియన్ కంపెనీలు(Companies) తమకు అవసరమైన డబ్బులు(Money) సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ (IPO) ద్వారా షేర్లను ప్రజలకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్టీస్పెషాలిటీ(Multispecialty) పీడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (Rainbow Children's Medicare) కూడా ఐపీఓకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఏప్రిల్ 27న ఐపీఓ సబ్స్క్రిప్షన్ (IPO Subscription) ప్రారంభం కానుందని రెయిన్బో(Rainbow) ప్రకటించింది. ఈ రూ.2,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 27న ప్రారంభమై ఏప్రిల్ 29న ముగియనుంది. ఈ సమయంలో ఈ ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూగా రూ.280 కోట్ల వరకు ఈక్విటీ షేర్లు, ఆఫర్ ఫర్ సేల్‌గా(Offer For Sale) రూ.2.4 కోట్ల వరకు ఈక్విటీ షేర్లు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 26న వేలం వేయవచ్చు. ఐపీఓ గురించి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ సైజు
రెయిన్బో ఐపీఓ సైజు రూ.2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇందులో రూ.280 కోట్ల వరకు ఈక్విటీ షేర్లు ఫ్రెష్ ఇష్యూగా వస్తుండగా.. సెల్లింగ్ షేర్ హోల్డర్స్ (Existing shareholders) ద్వారా 2.4 కోట్ల వరకు ఈక్విటీ షేర్ల విక్రయానికి రానున్నాయి.
Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ & గ్రే మార్కెట్ ప్రీమియం
పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.516-542గా నిర్ణయించారు. మార్కెట్ పార్టిసిపెంట్స్ ప్రకారం, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ షేర్లు గ్రే మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. గ్రే మార్కెట్లో ఇది రూ.52 ప్రీమియంతో ట్రేడవుతోంది.
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ రిజర్వేషన్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో అర్హులైన ఉద్యోగుల సబ్స్క్రిప్షన్ కోసం 3 లక్షల వరకు షేర్లు రిజర్వ్ అవుతాయి.
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ ఐపీఓ ఆబ్జెక్టివ్
కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి, కొత్త ఆసుపత్రుల కోసం వైద్య పరికరాలను కొనుగోలు చేయడానికి మూలధన వ్యయం (Capital Expenditure)పై ఫ్రెష్ ఇష్యూ నుంచి వచ్చే నికర ఆదాయాన్ని కంపెనీ వినియోగిస్తుంది. అలానే కంపెనీ పూర్తిగా జారీ చేసిన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) ముందస్తు విముక్తి కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఐపీఓని రెయిన్బో నిర్వహిస్తోంది.
పెట్టుబడి నిర్వాహకులు & జాబితా
కొటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, IIFL సెక్యూరిటీస్ అనేవి ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ (Book Running Lead Manager)లుగా ఉన్నాయి. రెయిన్బో ఈక్విటీ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేయాలని ప్రతిపాదించడం జరిగింది. "ఇది రెయిన్బో ఈక్విటీ షేర్ల మొదటి పబ్లిక్ ఆఫర్. ఈ కంపెనీ ఈక్విటీ షేర్లకు అధికారిక మార్కెట్ లేదు. ఈక్విటీ షేర్ల ఫేస్ వాల్యూ రూ.10" అని రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ పేర్కొంది.
Flipkart Offer: ఈ పాపులర్స్మార్ట్ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే
ప్రమోటర్లు ఆఫర్-ఫర్-సేల్ ద్వారా షేర్ల విక్రయం
ఈ ఐపీఓలో రమేష్ కంచర్ల, దినేష్ కుమార్ చిర్ల, ఆదర్శ్ కంచర్ల వంటి ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ పద్మ కంచర్ల, పెట్టుబడిదారులు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పీఎల్సీ, సీడీసీ ఇండియా వంటి ప్రమోటర్ల ఆఫర్-ఫర్-సేల్ కూడా ఉన్నాయి.
రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ బ్యాక్ గ్రౌండ్
రెయిన్బో దక్షిణ భారతదేశానికి చెందిన మల్టీస్పెషాలిటీ పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ హాస్పిటల్ చైన్. ఈ కంపెనీకి ఆరు నగరాల్లో 14 ఆసుపత్రులు.. మూడు క్లినిక్‌లు ఉన్నాయి. వీటి మొత్తం పడకల సామర్థ్యం 1,500. ఇది న్యూ బోర్న్, పిల్లల ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ మల్టీస్పెషాలిటీ సేవలు, పీడియాట్రిక్ క్వాటర్నరీ కేర్, ప్రసూతి, గైనకాలజీ వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది. ఇందులో సాధారణ, సంక్లిష్టమైన ప్రసూతి సంరక్షణ.. మల్టీడిసిప్లినరీ ఫీటల్ కేర్, పెరినాటల్ జెనెటిక్, ఫెర్టిలిటీ కేర్ ఉన్నాయి.
నిపుణుల అభిప్రాయం
తాజాగా ఏంజెల్ వన్ రీసెర్చ్ అనలిస్ట్ (ఈక్విటీస్) యష్ గుప్తా మాట్లాడుతూ, “రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ ఐపీఓపై మాకు సానుకూల దృక్పథం ఉంది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత లాభం ఏడాది ప్రాతిపదికన 228 శాతం పెరిగింద"ని ఆయన తెలిపారు. ఈ సమయంలో కంపెనీ ప్రాఫిట్ 126.4 కోట్లకు చేరుకోగా.. ఇదే కాలంలో ఆదాయం కూడా 15.2 శాతం పెరిగిందని గుప్తా వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, IPO, Medicare, Public subscription, Rainbow