Indian Railways: ఇక రైలు టికెట్ల బుకింగ్ ఇంకా ఈజీ

IRCTC-RailYatri | ఐఆర్‌సీటీసీ, రైల్‌యాత్రి మధ్య కొన్ని నెలలపాటు వివాదం నడిచింది. రైల్‌యాత్రి అందిస్తున్న సేవలు అనధికారమని ఐఆర్‌సీటీసీ వాదించింది. వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ తీసుకొని సేవలు మొదలుపెట్టింది రైల్‌యాత్రి.

news18-telugu
Updated: July 2, 2019, 11:42 AM IST
Indian Railways: ఇక రైలు టికెట్ల బుకింగ్ ఇంకా ఈజీ
Indian Railways: ఇక రైలు టికెట్ల బుకింగ్ ఇంకా ఈజీ...
  • Share this:
తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి గుడ్ న్యూస్. రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది భారతీయ రైల్వే. ఇంటర్ సిటీ ట్రాన్‌పోర్టేషన్ నెట్‌వర్క్, ట్రావెల్ యాప్ అయిన RailYatri ఇప్పుడు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌-IRCTC అఫీషియల్ పార్ట్‌నర్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత రైలు టికెట్ల బుకింగ్ కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్ రూపొందించినట్టు రైల్‌యాత్రి ప్రకటించింది. ఈ లైసెన్స్ ప్రకారం రైలు టికెట్ బుకింగ్ సేవలు అందించడానికి ఐఆర్‌సీటీసీతో రైల్‌యాత్రి అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. రైల్‌యాత్రి గత ఆరేళ్లుగా లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ, రైల్‌యాత్రి మధ్య కొన్ని నెలలపాటు వివాదం నడిచింది. రైల్‌యాత్రి అందిస్తున్న సేవలు అనధికారమని ఐఆర్‌సీటీసీ వాదించింది. వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ తీసుకొని సేవలు మొదలుపెట్టింది రైల్‌యాత్రి.

RailYatri ప్లాట్‌ఫామ్‌లో రైలు టికెట్లు బుక్ చేయడం మాత్రమే కాదు పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్, సీట్ల లభ్యత, టికెట్ కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ లాంటి సేవల్ని కూడా పొందొచ్చు. రైల్వే సేవలతో పాటు ఆన్‌లైన్ బస్ టికెట్స్, మీల్ ఆన్ ట్రైన్ లాంటి సేవల్ని కూడా అందిస్తోంది రైల్‌యాత్రి. ఇక భారతదేశంలోని 12 నగరాల్లో ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్ సేవల్ని కూడా రైల్ యాత్రి ద్వారా పొందొచ్చు.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...

IRCTC: హైదరాబాద్‌-గోవా టూర్... తక్కువ ధరకే ప్యాకేజీIRCTC Tour: రూ.6,300 ధరకే హరిద్వార్, రిషికేష్ ప్యాకేజీ
Published by: Santhosh Kumar S
First published: July 2, 2019, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading