హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railways: దసరా స్పెషల్.. ట్రైన్ ప్యాసింజర్లకు ఇండియన్ రైల్వేస్ అదిరే శుభవార్త!

Indian Railways: దసరా స్పెషల్.. ట్రైన్ ప్యాసింజర్లకు ఇండియన్ రైల్వేస్ అదిరే శుభవార్త!

దసరా స్పెషల్.. ట్రైన్ ప్యాసింజర్లకు రైల్వేస్ అదిరే శుభవార్త!

దసరా స్పెషల్.. ట్రైన్ ప్యాసింజర్లకు రైల్వేస్ అదిరే శుభవార్త!

Train Passengers | మీరు ట్రైన్ జర్నీ తరుచుగా చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ తాజాగా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. దసరా సందర్భంగా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Dasara 2022 | ఇండియన్ రైల్వేస్ (Railways) తన ప్యాసింజర్లకు తీపికబురు అందించింది. కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. దసరా సందర్భంగా ప్రత్యేక సర్వీసులు తీసుకువచ్చింది. నవరాత్రి సందర్భంగా స్పెషల్ ఫుడ్ మెనూను ప్రవేశపెట్టింది. ట్రైన్ (Train) జర్నీ చేసే వారు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు.

  తొమ్మిది రోజుల నవరాత్రి పండుగలో ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వేస్ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఉపవాసం ఉన్న వారు ఈ స్పెషల్ మెనూ సర్వీసులు పొందొచ్చు. ఆహారం తినొచ్చు. సెప్టెంబర్ 26 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 5 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.

  అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

  రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. దసరా సందర్భంగా స్పెషల్ మెనూ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అక్టోబర్ 5 వరకు ఈ సేవలు లభిస్తాయి. ప్రయాణికులు ఈ సర్వీసులను పొందొచ్చు. ట్రైన్ జర్నీ చేసే వారు ఈ స్పెషల్ సర్వీసులను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  ఉద్యోగులకు కమ్మటి వార్త.. భారీగా జీతాల పెంపు?

  స్పెషల్ వ్రత్ ఫుడ్‌ను ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు. ఐఆర్‌సీటీసీ ఇకేటరింగ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే 1323 నెంబర్‌కు కాల్ చేసి వివరాలు పొందొచ్చు. అందువల్ల ఉపవాసం ఉన్న వారు ఇబ్బంది లేకుండా ఫాస్టింగ్ ఫుడ్ ట్రైన్‌లోనే ఆర్డర్ ఇవ్వొచ్చు.

  కాగా మరోవైపు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)ఇటీవలనే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నవరాత్రి సందర్భంగా ఈ సర్వీసులు లాంచ్ చేసింది. ఈ ట్రైన్‌లో ప్యాంట్రీ కార్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, సీసీ టీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్ సర్వీసులు వంటివి ఉంటాయి. ఈ ట్రైన్ ఢిల్లీ నుంచి కాత్రాకు ప్రయాణించాల్సి ఉంది. సెప్టెంబర్ 30న ఈ ట్రైన్ బయలుదేరుతుంది. ఈ ట్రైన్‌లో ప్రయాణికులు ఢిల్లీ, ఘాజియాబాద్, మీరట్, ముజఫర్ నగర్, సహారాపూర్, అంబాలా, సర్హింద్, లుధియానాలో ఎక్కొచ్చు. దిగొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Indian Railways, Navaratri, Railways, Special Trains, Train

  ఉత్తమ కథలు