Indian Railways : రైల్వేలకు బడ్జెట్‌లో రూ.65,837 కోట్లు... పీపీపీ విధానం కలిసొస్తుందా?

Union Budget 2019 : ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులే ఇప్పుడూ ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

Krishna Kumar N | news18-telugu
Updated: July 6, 2019, 8:58 AM IST
Indian Railways : రైల్వేలకు బడ్జెట్‌లో రూ.65,837 కోట్లు... పీపీపీ విధానం కలిసొస్తుందా?
ఇండియన్ ట్రైన్ (Image : Twitter / Rail Analysis India)
Krishna Kumar N | news18-telugu
Updated: July 6, 2019, 8:58 AM IST
Union Budget 2019 : దేశంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి కోసం రానున్న 12 సంవత్సరాల్లో దాదాపు రూ.50 లక్షల కోట్ల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే సంవత్సరానికి దాదాపు రూ.1.4 నుంచీ రూ.1.6 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఆమె వివరించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల కోసం ఏటా లక్షల కోట్ల నిధులు అవసరమనీ, ఇందుకోసం ప్రైవేటీకరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనీ నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు రైల్వేల్లో పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) కింద ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అలాగే కొత్త మెట్రో ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 300 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. ఓవరాల్‌గా ఈసారి బడ్జెట్‌లో రైల్వే కోసం రూ.65,837 కోట్లు కేటాయించారు. 2019-20లో మూలధన ఖర్చుల కింద రూ.1.60 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల సదుపాయాల కోసం 200 శాతం అధికంగా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

గతేడాది రైల్వేల మూలధన ఖర్చు రూ.1.48 లక్షల కోట్లుగా ఉంటే... బడ్జెట్‌లో రూ.55,088 కోట్లు కేటాయించారు. మధ్యంతర బడ్జెట్‌లో రూ.1.58 లక్షల కోట్లు కేటాయించారు. 2019-20 బడ్జెట్‌ ప్రకారం రూ.7,255 కోట్లను కొత్త రైలు మార్గాల నిర్మాణం కోసం కేటాయించారు. అలాగే... గాజ్ (gauge) కన్వెర్షన్ కోసం రూ.2,200 కోట్లు, డబ్లింగ్ పనుల కోసం రూ.700 కోట్లు, రోలింగ్ స్టాక్ కోసం రూ.6,114 కోట్లు, సిగ్నలింగ్ అండ్ టెలికం కోసం రూ.1,750 కోట్లు కేటాయించారు. ఫిబ్రవరిలో చేసిన కేటాయింపులే ఇప్పుడూ ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్. ప్రయాణికుల సౌకర్యాల కోసం ఈసారి బడ్జెట్‌లో రూ.3,422 కోట్లు కేటాయించగా... గతేడాది అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.1,657 కోట్లు మాత్రమే కేటాయించారు.

పీపీపీ విధానం ద్వారా... రైల్వేలు వేగంగా వృద్ధి చెందడమే కాకుండా... రైల్వే ప్రాజెక్టులకు ఫ్రైట్ సర్వీసులు పుంజుకుంటాయన్నారు. స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా... PPP విధానంలో చిన్న పట్టణాల్లో కూడా రైల్వేలను విస్తరించాలని కోరారు. అలాగే మెట్రో రైల్ నెట్‌వర్క్‌ని కూడా విస్తరించాలని అన్నారు. ఐతే... పీపీపీ విధానం ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్నది వెంటనే చెప్పలేం. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల పూర్తి, ప్రయాణికులకు కల్పించే సదుపాయాలూ అన్ని అంశాలూ ప్రభావితం చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

First published: July 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...