సాధారణంగా రైళ్లు (Trains), బస్సుల్లో (Buses) ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సార్లు వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే.. వస్తువులు పోవడమే కానీ.. మళ్లీ దొరకడం చాలా కష్టం. ఈ ఆలోచనతోనే చిన్న చిన్న వస్తువులు పోయినప్పుడు మనలో చాలా మంది ఎలాగు దొరకవు కదా అనుకుని వదిలేస్తూ ఉంటారు. అయితే.. ట్రైన్ లో ఓ చిన్నారి పోగొట్టుకున్న బొమ్మను అధికారులు వెతికి పట్టుకుని ఆ చిన్నారికి అందించి ఆనందం నింపిన ఘటన తాజాగా వైరల్ గా (Viral) మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4న సికింద్రాబాద్-అగర్తల ట్రైన్ (Train No.07030)లో ప్రయాణిస్తున్న ఓ 19 నెలల చిన్నారి ఓ బొమ్మను పోగొట్టుకుంది. తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను పోగొట్టుకోవడంతో ఏడుస్తున్న ఆ చిన్నారిని గమనించిన మరో ప్రయాణికుడు రైట్ మదన్ యాప్ సహాయంతో 139 నంబర్ కు ఫోన్ చేశాడు.
దీంతో స్పందించిన రైల్వే అధికారులు పశ్చిమ బెంగ్ లోని న్యూజలపాయిగురి స్టేషన్ ప్రాంతంలో ఆ బొమ్మను గుర్తించారు. ఆ పాప అడ్రస్ ను వెతికి పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ లోని ఖాజీగావ్ లో ఆ పాప చిరునామాను గర్తించిన అధికారులు ఇంటికి వెళ్లి మరీ ఆ బొమ్మను అందించారు.
Railways brings back the smile of its cute little boy by recovering his favourite toy! @RailMinIndia #toys #kids pic.twitter.com/3eS7B69IQx
— South Central Railway (@SCRailwayIndia) January 6, 2023
దీంతో ఆ పాప ఆనందానికి అవదుల్లేవు. ఇందుకు సంబంధించిన ఫొటోలను దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కళ్లల్లో ఆనందం నింపిన రైల్వే అధికారులను అభినందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.