మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? లేదా అప్పుడప్పుడు రైలులో టూర్ వెళ్తుంటారా? ఇకపై మీరు రైలులో పాటలు వినొచ్చు. సినిమాలు చూడొచ్చు. ప్రయాణికులకు వినోదాన్ని అందించే కంటెంట్‌ను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకురాబోతోంది. రైల్వే ప్రయాణికులకు వినోదాన్ని పంచే కంటెంట్‌ను అందించాలంటూ ఓవర్ ది టాప్(OTT) సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది రైల్వే. అయితే ఇందుకు అయ్యే ఖర్చును రైల్వే ఎలా భరిస్తుందన్న స్పష్టత లేదు. ఇది ఆన్ డిమాండ్ సర్వీస్ కావడంతో ప్రయాణికుల నుంచి ఎంత ఛార్జీలు వసూలు చేస్తారు? కంటెంట్ ప్రొవైడర్లకు ఎంత చెల్లిస్తారు? న్నది తెలియాల్సి ఉంది. కంటెంట్ ప్రొవైడర్లు అడ్వర్‌టైజింగ్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించే అవకాశముంది.
Read this: JIO offer: రిలయెన్స్ జియో నుంచి 'రియల్‌మీ యూత్ ప్లాన్'... లాభాలివే
ఛార్జీలు కాకుండా ఇతర ఆదాయమార్గాలను అన్వేషిస్తోంది రైల్వే. అందులో కంటెంట్ ఆన్ డిమాండ్ ఒకటి. వాస్తవానికి 2017 జనవరిలోనే ఈ దిశగా ప్రణాళికలు రూపొందించింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఆ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓటీటీ సంస్థలు టెండర్లు దాఖలు చేసిన తర్వాత త్వరలో ఫైనలైజ్ అయ్యే అవకాశముంది. ఆ ప్రక్రియ పూర్తైతే ఇక మీకు రైలులో పాటలు వినో, సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం ప్రయాణికులు కొంత చెల్లించుకోక తప్పదు.
Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
ఇవి కూడా చదవండి:
Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా
PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం
WhatsApp: వాట్సప్ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways, Train