రైలు హైజాక్ అయిందంటూ ఓ ప్రయాణికులు చేసిన ట్వీట్‌తో కాసేపు అంతా టెన్షన్ టెన్షన్. కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో (Karnataka Sampark Kranti Express) ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఈ ట్వీట్ చేశాడు. రైల్వే ట్విట్టర్ హ్యాండిల్స్‌కి ట్యాగ్ చేస్తూ రైలు నెంబర్ 12650 హైజాక్ అయిందని, వెంటనే సాయం చేయండి అంటూ ట్వీట్ చేశాడు. వెంటనే రైల్వేస్ సేవా కేంద్రం (Railways Seva Kendra) అప్రమత్తమైంది. కాంటాక్ట్ నెంబర్‌తో పాటు రైలు వివరాలు షేర్ చేయాలని కోరింది. రైల్వే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి తేలింది ఏంటంటే... ఆ రైలు హైజాక్ కాలేదు. కేవలం డైవర్ట్ మాత్రమే అయింది.
కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ మజ్రి జంక్షన్ - సీతాఫల్ మండి రూట్‌లో డైవర్ట్ చేశారు రైల్వే అధికారులు. రైలు వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా మరో రూట్‌లో వెళ్తుండటంతో కృష్ణ బెహురా అనే ప్రయామికుడు కంగారుపడ్డాడు. అందుకే రైలు హైజాక్ అయిందంటూ ఐఆర్‌సీటీసీకి, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్‌కు ట్వీట్ చేశాడు. వెంటనే రైల్వేస్ సేవా కేంద్రం స్పందించడం, రైల్వే పోలీసులు కూడా ఈ కంప్లైంట్‌ను పరిశీలించడం అంతా చకచకా జరిగిపోయాయి.
IRCTC Shirdi Tour: హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ టూర్... రూ.4,000 లోపే మూడు రోజుల ప్యాకేజీ
The train is not hijacked. Train is diverted. Don’t get panic
— rpfscr (@rpfscr) July 10, 2022
సదరు ప్రయాణికుడికి రైల్వే పోలీసులు ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు. రైలు హైజాక్ కాలేదని, రూట్ డైవర్ట్ చేశారని, కంగారు పడవద్దని సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారం ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సదరు ప్రయాణికుడు రూమర్స్ ప్రచారం చేశాడంటూ మండిపడ్డారు. సైబర్ క్రైమ్ యూనిట్ అతనిపై కేసు పెట్టాలని, లేదా భారీ జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. అయితే రైలు మరో రూట్‌లో వెళ్తున్న సమాచారాన్ని ప్రయాణికులకు భారతీయ రైల్వే ఇవ్వకపోవడం కూడా తప్పేనని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆ ప్రయాణికుడు తన ట్వీట్‌ని డిలిట్ చేయడం విశేషం.
Cashback on Petrol: పెట్రోల్ కొంటే క్యాష్‌బ్యాక్, సినిమా టికెట్లపై డిస్కౌంట్... ఈ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసా?
మెయింటనెన్స్ పనుల కారణంగా భారతీయ రైల్వే కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ను డైవర్ట్ చేసింది. రైళ్లను డైవర్ట్ చేస్తే ఆ వివరాలను ఆయా జోన్లు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్‌లో వివరిస్తుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India Railways, IRCTC, Railways, VIRAL NEWS, Viral tweet