Railway Budget 2020: రైల్వే శాఖకు బడ్జెట్‌లో లభించిన వరాలివే

Railway Budget 2020: రైల్వే శాఖకు బడ్జెట్‌లో లభించిన వరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Railway Budget 2020 | మరిన్ని ప్రైవేట్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రైతులు పండించే ఆహార పదార్థాలను తరలించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో కిసాన్ రైలు నడపనున్నట్టు తెలిపారు.

  • Share this:
    బడ్జెట్‌లో భారతీయ రైల్వేకు వరాలు కురిపించింది కేంద్ర ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని తేజస్ రైళ్లను నడపనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 150 ప్రైవేట్ రైళ్లను నడపనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ రెండు రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అలాంటి మరిన్ని ప్రైవేట్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రైతులు పండించే ఆహార పదార్థాలను తరలించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో కిసాన్ రైలు నడపనున్నట్టు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ను త్వరలో పూర్తి చేయనుంది. రైల్వే ట్రాక్‌ల పక్కన భారతీయ రైల్వేకు చెందిన భూమిలో అతిపెద్ద సోలార్ పవర్ కెపాసిటీ ఏర్పాటు చేయనుంది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో 4 స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు చేపట్టనుంది. దాంతో పాటు 11,000 రైల్వే ట్రాక్‌ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయనుంది. గతంలో రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉంది. కానీ... కొన్నేళ్లుగా సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను చేర్చేశారు.

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: కాలేజీకి వెళ్లకుండానే డిగ్రీ... ఆన్‌లైన్‌లో కోర్సులు...

    Union Budget 2020: బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరాలివే...

    Union Budget 2020: బ్యాంకులో డబ్బు దాచుకునేవారికి శుభవార్త
    Published by:Santhosh Kumar S
    First published: