• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • RAILTEL CORPORATION OF INDIA LIMITED IPO SUBSCRIPTION TO OPEN TOMORROW SS GH

RailTel IPO: రైల్‌టెల్ ఐపీవో ప్రారంభానికి అంతా సిద్ధం... ఒక్కో షేర్ ధర ఎంతంటే?

RailTel IPO: రైల్‌టెల్ ఐపీవో ప్రారంభానికి అంతా సిద్ధం... ఒక్కో షేర్ ధర ఎంతంటే?

RailTel IPO: రైల్‌టెల్ ఐపీవో ప్రారంభానికి అంతా సిద్ధం... ఒక్కో షేర్ ధర ఎంతంటే? (image: Railtel)

RailTel IPO | రైల్‌టెల్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఫిబ్రవరి 16న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్, ఇతర వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ప్రభుత్వ రంగ సంస్థ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌(ఐపీఓ)ను 2021 ఫిబ్రవరి 16న ప్రారంభించటానికి సిద్ధమవుతోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను సేకరించాలని రైల్ టెల్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని మినీరత్న హోదా కలిగిన సంస్థ. ఇందులో నుంచి 25 శాతం మేర పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2018లో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైల్ టెల్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఈ ఐపీఓలో భాగంగా స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా 8,71,53,369 ఈక్విటీ షేర్లను అమ్మకానికి ఉంచి రూ .819.24 కోట్ల వరకు సమకూర్చుకోవాలనే లక్ష్యంతో రైల్ టెల్ కార్పొరేషన్ ఉంది. అలాగే, ఇది ఆఫర్‌ చేసే ఈక్విటీ షేర్లలో 5 లక్షల షేర్లు కంపెనీ ఉద్యోగుల కోసం మాత్రమే కేటాయించడం జరిగిందని రైల్ టెల్ స్పష్టం చేసింది. 2021 సంవత్సరంలో ప్రారంభమవుతున్న ఏడో ఐపీఓగా దీన్ని పేర్కొనవచ్చు. 2021లో ఇప్పటివరకు ప్రారంభమైన ఐపీఓలలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండిగో పెయింట్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ, స్టవ్ క్రాఫ్ట్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, నురేకా లిమిటెడ్ వంటివి ఉన్నాయి. షేర్ల కొనుగోలుకు ముందు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.

రైల్‌టెల్ ఐపీఓ తేదీ


రైల్ టెల్ కార్పొరేషన్ ఐపీఓ 2021 ఫిబ్రవరి 16న ప్రారంభమై ఫిబ్రవరి 18న ముగుస్తుంది. ఈ సంస్థకు చెందిన షేర్లు ఫిబ్రవరి 26న బిఎస్ఈ, ఎన్ఎస్ఈ లిస్టింగ్ లలో చేర్చబడతాయి.

Sukanya Samriddhi Yojana: ఎస్‌బీఐలో సింపుల్‌గా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవండి ఇలా

LPG Price Hike: సామాన్యులకు షాక్ మీద షాక్... లాక్‌డౌన్ తర్వాత రూ.230 పెరిగిన సిలిండర్ ధర

రైల్‌టెల్ ఐపీఓ లాట్ సైజు


రైల్‌టెల్ ఐపీఓ మార్కెట్ లాట్ సైజు 155 షేర్లుగా ఉంది. రిటైల్- ఇన్వెస్టర్లు కూడా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది. ఒక్కో ఇన్వెస్టర్ గరిష్టంగా 13 లాట్ల వరకు కొనుగోలు చేయవచ్చు. కాకపోతే, కనీస మొత్తంగా రూ.14,570గా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పబ్లిక్ ఇష్యూల్లో సగం వాటాను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం కేటాయించారు. మిగిలిన సగం వాటాలో 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్లకు కేటాయించారు.

ఒక్కో షేర్ ఎంత?


ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ విలువను రూ .93 నుంచి రూ.94 గా నిర్ణయించింది రైల్ టెల్ కార్పొరేషన్.

లీడ్ మేనేజర్లు


ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ సంస్థలు ఈ ఐపీఓ ని నిర్వహిస్తున్నాయి.

రిజిస్ట్రార్


కె ఫింటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తుంది.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర సిద్ధంగా ఉన్నాయా?

Paytm: పేటీఎంలో కొత్త ఫీచర్... క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1,000 క్యాష్ బ్యాక్

దరఖాస్తు ఎలా చేయాలి?


రైల్ టెల్ కార్పొరేషన్ ఐపీఓ కొనుగోలుకు UPI లేదా ASBA చెల్లింపు పద్ధతిని అనుసరించవచ్చు. ASBA IPO అప్లికేషన్ మీ బ్యాంక్ ఖాతా ఉన్న నెట్ బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే UPI IPO అప్లికేషన్ ని మాత్రం బ్రోకర్లు అందజేస్తారు. రైల్‌టెల్ ఒక మినీ రత్న (కేటగిరి -1) సంస్థ. ఇది 2000 సెప్టెంబర్లో రైల్వే మంత్రిత్వ శాఖలో విలీనం చేయబడింది. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంటుంది. రైల్‌టెల్ భారతదేశంలోని అతిపెద్ద న్యూట్రల్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ గా కూడా గుర్తింపు పొందింది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు