ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ( NMACC) ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిఎండి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోకా, ఈషా, అనంత్ అంబానీ సందడి చేశారు. పారిశ్రామికవేత్త అజయ్ పిరమల్ కూడా వేడుకకు హాజరయ్యారు. హాలీవుడ్ నటులు టామ్ హాలండ్, నటి జెండయా, అనుష్క దండేకర్, ఉద్ధవ్ థాకరే కుటుంబం, యువరాజ్ సింగ్, ఆయన భార్య హాజెల్ కీచ్, రాహుల్ వైద్య, దిశా పర్మార్, నటి సోనమ్ కపూర్, నీతూ కపూర్, సూపర్ స్టార్ రజినీకాంత్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
NMACC ప్రారంభోత్సవ వేడుకలో అనంత్ అంబానీ, ఆయన కాబోయే భార్య రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంట నలుపు రంగులో ఉన్న సంప్రదాయ దుస్తులలో కనిపించింది. అనంత్ అంబానీ కుర్తా-పైజామా కాంబో, రాధికా మర్చంట్ నల్ల చీర ధరించారు. ఇద్దరూ కలిసి కెమెరాకు పోజులిచ్చారు.
View this post on Instagram
వీరికంటే ముందు ముకేశ్ అంబానీ, ఆయన కుమార్తె ఈషా ఈ కార్యక్రమానికి వచ్చారు. తండ్రీకూతుళ్లు కూడా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించారు. ఈషా అందమైన తెల్లని వస్త్రధారణలో కనిపించగా, ఆమె తండ్రి నలుపు రంగు సూట్‌లో కనిపించారు. ఆకాశ్ అంబానీ , శ్లోకా మెహతా అందమైన దుస్తులను ధరించారు. ఆకాష్ గ్రీన్ కుర్తా కాంబో ధరించగా.. శ్లోకా చీర కట్టులో సందడి చేశారు.
View this post on Instagram
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జనవరి 19, 2023న ముంబైలో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anant Ambani and Radhika Merchant Wedding, Mukesh Ambani, Mumbai, Nita Ambani