Home /News /business /

RADHAKISHAN DAMANI PORTFOLIO THIS MULTIBAGGER STOCK DOUBLED SHAREHOLDERS MONEY IN 2021 MK

Radhakishan Damani Portfolio: దమానీ పోర్ట్ ఫోలియోలో డబుల్ ఇంజన్ లాభాలు అందించిన ఈ స్టాక్ మీ దగ్గర ఉందా..

దమానీ దృష్టిలో పడ్డ ఒక స్టాక్ మంగళం ఆర్గానిక్స్ ( Mangalam Organics). ఈ స్టాక్ దమానీ ఆస్తిని రెండింతలు చేసింది అంటే నమ్మశక్యం కాదేమో. మంగళం ఆర్గానిక్స్ మూడు శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.1007 స్థాయిని తాకింది.

దమానీ దృష్టిలో పడ్డ ఒక స్టాక్ మంగళం ఆర్గానిక్స్ ( Mangalam Organics). ఈ స్టాక్ దమానీ ఆస్తిని రెండింతలు చేసింది అంటే నమ్మశక్యం కాదేమో. మంగళం ఆర్గానిక్స్ మూడు శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.1007 స్థాయిని తాకింది.

దమానీ దృష్టిలో పడ్డ ఒక స్టాక్ మంగళం ఆర్గానిక్స్ ( Mangalam Organics). ఈ స్టాక్ దమానీ ఆస్తిని రెండింతలు చేసింది అంటే నమ్మశక్యం కాదేమో. మంగళం ఆర్గానిక్స్ మూడు శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.1007 స్థాయిని తాకింది.

    రాధాకృష్ణ దమానీ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది మార్కెట్ బుల్, స్టాక్ మార్కెట్లో ఏస్ ఇన్వెస్టర్ అయినటువంటి దమానీ తన పోర్ట్ ఫోలియోలో ఎప్పటికప్పుడు క్వాలిటీ స్టాక్స్ తో సంపద సృష్టిస్తుంటాడు. అలాంటి దమానీ దృష్టిలో పడ్డ ఒక స్టాక్ మంగళం ఆర్గానిక్స్ ( Mangalam Organics). ఈ స్టాక్ దమానీ ఆస్తిని రెండింతలు చేసింది అంటే నమ్మశక్యం కాదేమో. మంగళం ఆర్గానిక్స్ మూడు శాతం పెరిగి ఇంట్రాడేలో రూ.1007 స్థాయిని తాకింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.858 కోట్లుగా నమోదైంది. ఈ షేర్లు 200 రోజుల మూవింగ్ యావరేజ్ కన్నా ఎగువన కదలాడుతుండగా, 20 రోజుల మూవింగ్ యావరేజ్ కన్నా కూడా తక్కువగా ఉండటం గమనార్హం. గడిచిన సంవత్సర కాలంలో మంగళం ఆర్గానిక్స్ షేర్ ధర రూ.404 నుంచి రూ.1007 వరకూ ఎగబాకింది. అంటే దాదాపు 149 శాతం లాభపడింది.

    Central Bank Jobs 2021: సెంట్రల్ బ్యాంకులో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు సైతం ఈ స్టాక్ ద్వారా దాదాపు 2900 శాతం గడిచిన 5 సంవత్సరాల్లో లాభపడటం విశేషం. అంతేకాదు గత పదేళ్లలో ఈ స్టాక్ 4000 శాతం పెరగింది. అలాగే ఈ స్టాక్ వరుస పెరగుదలకు కారణం చూసినట్లయితే, ఇండియాలో అతి తక్కువగా లభించే కెమికల్ మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ లాభాలకు కారణం అవుతోంది. ముఖ్యంగా ఈ రంగానికి దేశీయంగా డిమాండ్ ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ కంపెనీ ఇప్పటికే డెట్ ఫ్రీ ( రుణ రహిత) గా మారిపోయింది. కంపెనీ గత సంవత్సరం ఏకంగా 78.13 శాతం గ్రోత్ కనపరిచింది.

    UPSC CDS 2022: నిరుద్యోగులకు అలర్ట్... 341 పోస్టులతో యూపీఎస్‌సీ నోటిఫికేషన్

    రానున్న మరిన్ని క్వార్టర్లలో కంపెనీ షేరు ధర దాదాపు రూ.1650 వరకూ వెళ్లే చాన్స్ ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేన్తున్నాయి. కంపెనీ ఫండమెంటల్స్ చూసినట్లయితే ఇప్పటికే కంపెనీ గత క్వార్టర్ లో రూ.22 కోట్ల లాభం నమోదు చేసింది.

    ఏస్ ఇన్వెస్టర్ రాధాకృష్ణ దమానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ అధినేతగా మనందరికీ సుపరిచితులే, అయితే ఆయన మంగళం ఆర్గానిక్స్ లో తన వాటాను దాదాపు 4.3 శాతం పెంచుకున్నారు.  గతంలో ఆయన వాటా 2,2 శాతంగా ఉండేది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Multibagger stock, Radhakishan Damani, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు