చందాకొచ్చర్ - వీడియోకాన్ ‘క్విడ్ ప్రో కో’, ఒక్క రోజులో రూ.64 కోట్లు

చందాకొచ్చర్ (File)

వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ మంజూరు చేసింది. ఆ డబ్బు అకౌంట్‌లో పడిన మరుసటి రోజే, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కి చెందిన కంపెనీలోకి రూ.64 కోట్లు వీడియో కాన్ సంస్థ చైర్మన్ ట్రాన్స్‌ఫర్ చేసినట్టు సీబీఐ తెలిపింది.

 • Share this:
  ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ,ఎండీ చందా కొచ్చర్ వీడియో కాన్ కంపెనీలో లోన్లు ఇవ్వడం వల్ల తన భర్త ద్వారా రూ.64 కోట్ల మేర లబ్ధి పొందారని సీబీఐ ఆరోపించింది. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా ఉన్న సమయంలో ఆమె వీడియోకాన్ గ్రూప్‌నకు ఆరు లోన్లు మంజూరు చేశారు. 2009 నుంచి 2011 మధ్య వేణుగోపాల్ ఎన్ దూత్‌ చైర్మన్‌గా ఉన్న వీడియోకాన్ గ్రూప్‌నకు లోన్లు మంజూరయ్యాయి. రూ.300 కోట్ల విలువైన రుణాలను ఇచ్చినందుకు గాను ఆమె లబ్ధి పొందారని సీబీఐ ఆరోపించింది.

  ఐసీఐసీఐ నుంచి చందా కొచ్చర్ ఔట్... కొత్త బాస్ సందీప్ భక్షి!, Chanda Kochhar Quits ICICI Bank; Sandeep Bakhshi New MD and CEO
  చందా కొచ్చర్ ఫైల్ ఫోటో (Reuters)


  2009 మేలో చందా కొచ్చన్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ అండ్ ఎండీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మూడు నెలలకే , అంటే 2009 ఆగస్ట్ 26న వీడియో కాన్ కంపెనీకి లోన్ మంజూరైంది. తాను పనిచేస్తున్న కంపెనీనే ఆమె మోసం చేయాలనుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఆ నిధులు 2009 సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి.

  chanda kochhar, ujjivan, deepak kochhar, chanda kochar news, icici customer care number, videocon group, cbi raids videocon, చందా కొచ్చర్, దీపిక్ కొచ్చర్, వీడియోకాన్, సీబీఐ సోదాలు, ఐసీఐసీఐ బ్యాంకు, వీడియోకాన్ సీఈవో
  దీపక్ కొచ్చర్, వేణుగోపాల్


  ఆశ్చర్యకరంగా వీడియోకాన్ అకౌంట్‌లో లోన్ డబ్బులు పడిన తర్వాత రోజు, అంటే 2009 సెప్టెంబర్ 8న చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కి చెందిన ‘ను పవర్ రెన్యూవబుల్స్’ కంపెనీకి వీడియోకాన్ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ రూ.64కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. దీపక్ కొచ్చర్ సంస్థ ‘ను పవర్ రెన్యూవబుల్స్’ సంస్థ తొలి పవర్ ప్లాంట్ సాధించడానికి అవసరమైన డబ్బు ద్వారా ద్వారా సమకూరిందని సీబీఐ ఆరోపించింది.

  ఆయేషా హత్య కేసులో మరో మలుపు: సీబీఐకి అప్పగించిన హైకోర్టు, High Court handovers Ayesha Murder Case to CBI
  ప్రతీకాత్మక చిత్రం


  అసలు ఈ ‘ను పవర్ రెన్యూవబుల్స్’ సంస్థను 2008 డిసెంబర్ 24న ఏర్పాటు చేశారు. వీడియోకాన్ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ దూత్, సౌరభ్ దూత్, చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ ఫస్ట్ డైరెక్టర్లుగా ఈ సంస్థను నెలకొల్పారు.
  First published: