మాంద్యానికి మందు... కేంద్రం అర్జెంటుగా తీసుకోవాల్సిన 10 నిర్ణయాలు ఇవే...

India Growth Slowdown : చూస్తుండగానే... భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోతోంది. మున్ముందు మరింత పతనమయ్యేలా ఉంది. ఈ పరిస్థితి నుంచీ దేశాన్ని కాపాడేదెలా? ఏం చేస్తే ఇండియా మళ్లీ గట్టెక్కుతుంది?

Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 12:32 PM IST
మాంద్యానికి మందు... కేంద్రం అర్జెంటుగా తీసుకోవాల్సిన 10 నిర్ణయాలు ఇవే...
అమిత్ షాతో మోదీ
  • Share this:
విదేశీ పెట్టుబడులకు ఉద్దీపనలు, బ్యాంకుల విలీనం... ఇలా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా... దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం మందగమనం నుంచీ గట్టెక్కేలా కనిపించట్లేదు. ఏప్రిల్-జూన్ మధ్య గడిచిన తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5 శాతానికి పరిమితమైంది. నిజానికి ఇది 8 శాతం ఉండాల్సింది. మాంద్యం నుంచీ ఇండియా గట్టెక్కాలంటే... కేంద్ర ప్రభుత్వం స్వల్పకాలిక, దీర్ఘ కాలిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. పారిశ్రామిక రంగం మందగిస్తుండటంతో... దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ మనం 2008 నాటి మాంద్యం పరిస్థితుల్లోకి జారుకుంటున్నామేమోనన్న టెన్షన్ ఎక్కువవుతోంది. కొంతమంది ఆర్థిక వేత్తలు... ఆల్రెడీ మనం ఆ పరిస్థితుల్లోనే ఉన్నామని కూడా అంటున్నారు.

మాంద్యం వల్ల కలిగే నష్టమేంటి : మాంద్యం అనేది ప్రమాదకరమైనది. అది వస్తే... పారిశ్రామిక రంగం దెబ్బతిని... నిరుద్యోగం పెరుగుతుంది. ప్రజల దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అందువల్ల వస్తువుల కొనుగోళ్లు తగ్గిపోతాయి. ఫలితంగా... పరిశ్రమల వస్తువులు అమ్ముడు కావు. అందువల్ల పరిశ్రమలకు వచ్చే ఆదాయం రాకుండా పోతుంది. ఫలితంగా పరిశ్రమలు... తమ కంపెనీల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక... ఉద్యోగాల నుంచీ తొలగిస్తాయి. దాని వల్ల నిరుద్యోగం మరింత పెరుగుతుంది... ఫలితంగా మరింత మంది దగ్గర డబ్బు లేకుండా పోతుంది. ఇలా ఈ సమస్య సైకిల్ చక్రంలా రౌండ్‌గా తిరుగుతూ... నానాటికీ ఎక్కువవుతూ ఉంటుంది. అది దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం.

ఇప్పటికే దేశంలో బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు దెబ్బతిన్నాయి. అలాగే ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కేందుకు కేంద్రం వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలేంటో, ఆర్థిక వేత్తలు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

సత్వరం తీసుకోవాల్సిన నిర్ణయాలు :
* ఆటోమొబైల్ రంగానికి రాయితీలు ఇవ్వాలి. పెట్టుబడులు పెరిగేలా చెయ్యాలి. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేపట్టేలా చెయ్యాలి.
* ఆటో రంగంలో ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేసేందుకు కావాల్సిన స్కిల్స్‌ నేర్చుకునేందుకు వారికి రాయితీలు ఇవ్వాలి.
* కోటి రూపాయల లోపు కంపెనీల నుంచీ GSTని మూడు నెలలకు ఓసారి వసూలు చెయ్యాలి.

* GST స్లాబ్ రేట్లను మరింత తగ్గించాలి.
* ప్రత్యక్ష పన్నుల విధానం తెచ్చి... దిగివ తరగతి వారికి టాక్స్ నుంచీ మినహాయింపు ఇవ్వాలి.
* ప్రజలు, పరిశ్రమలకు తేలిగ్గా రుణాలు (క్రెడిట్ ఫ్లో) అందేలా చెయ్యాలి.
* మూలధన వ్యయం తగ్గుతోంది కాబట్టి... వాస్తవ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్లు తగ్గించాలి.
* ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ విధానాల్లో మార్పులు తేవాలి.
* కేంద్ర ప్యాకేజీలు పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండాలి. ఉద్యోగులకు కొత్త స్కిల్స్ నేర్పించేలా చెయ్యాలి.
* మార్కెట్లలో సంస్కరణలు రావాలి. భూముల ధరలు తగ్గించి, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలి.

పై మార్పులు చేస్తే... ఆర్థిక వ్యవస్థ కొంతైనా కోలుకునే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక వేత్తలు.
Published by: Krishna Kumar N
First published: September 2, 2019, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading