Repo Rate | కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీపికబురు అందించింది. బ్యాంక్ (Bank) కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. తాజా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ (RBI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 12 పట్టణాల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా పని చేసే కాయిన్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. దీని వల్ల కాయిన్స్ లభ్యత పెరగనుంది. అలాగే మెషీన్ల ద్వారా నాణేల పంపిణీ పెరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
కాయిన్ వెండింగ్ మెషీన్లు ఆటోమెటిక్ మెషీన్స్. ఇవి బ్యాంక్ కరెన్సీ నోట్లకు కాయిన్లను అందిస్తాయి. అంటే మీరు కరెన్సీ నోటు పెడితే దానికి సమానమైన మొత్తంలో కాయిన్లు పొందొచ్చు. ఇకపై ఇలా కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా నాణేలను పొందొచ్చు. కరెన్సీ నోట్లతో పని ఉండదని చెప్పుకోవచ్చు. నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతాయి. కాయిన్ వెండింగ్ మెషీన్లు అనేవి లైటింగ్ సెన్సార్స్, మ్యాగ్నటిక్ సెన్సార్ల ద్వారా పని చేస్తాయి.
రైతులకు బ్యాంక్ అదిరే శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు, లాభాలెన్నో!
క్యూఆర్ కోడ్ బేస్డ్ వెండింగ్ మెషీన్ల ద్వారా యూపీఐ విధానంలో నేరుగా కాయిన్లు పొందొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద తొలిగా 12 పట్టణాల్లో ఈ వెండింగ్ మెషీన్లను తీసుకువస్తామని వెల్లడించింది. తర్వాత వీటిని మరింత విస్తరిస్తామని వివరించింది. పలు టాప్ బ్యాంకులతో కలిసి క్యూఆర్ కోడ్ కాయిన్ వెండింగ్ మెషీన్లను తయారు చేశామని ఆర్‌బీఐ తెలిపింది. క్యాష్‌లెస్ కాయిన్ వెండింగ్ మెషీన్లు ఇవ్వనీ పేర్కొంది. యూపీఐ ద్వారా కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయని, అప్పుడు మెషీన్ నుంచి కాయిన్లు బయటకు వస్తాయని వివరించింది.
ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 కొత్త సర్వీసులు!
రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్లేస్‌లు వంటి వాటిల్లో ఈ క్యూఆర్ కోడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్‌కు వచ్చిన ఫలితాల ఆధారంగా, వీటిని మరింత ప్రోత్సహించడానికి బ్యాంకులకు మార్గదర్శకాలను రూపొందిస్తామని ఆర్‌బీఐ తెలిపింది. కాగా ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర పెంచేసింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల రుణ గ్రహీతలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. నెలవారీ ఈఎంఐ పైకి చేరుతుంది. రుణాలు ప్రియం అవుతాయి. ఇక డబ్బులు దాచుకునే వారికి మాత్రం ఊరట కలుగుతుంది. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, Rbi, Reserve Bank of India, UPI