ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో(Auto Mobile Market) డిమాండ్‌ను వివిధ దేశాల కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. టాప్ గ్లోబల్ కంపెనీలు కొన్ని నేరుగా, మరికొన్ని స్థానిక సంస్థలతో కలిసి సరికొత్త బైక్స్(Bikes) తయారు చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ క్రమంలో చైనీస్ మోటార్‌సైకిల్ కంపెనీ QJ మోటార్(Motor), ఇండియాలో నాలుగు కొత్త మోటార్‌సైకిళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ SRC 250, SRC 500, SRV 300, SRK 400 బ్రాండ్ నేమ్స్‌తో బైక్స్‌ను ఇండియన్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది. వీటి ధరలను కూడా వెల్లడించింది.
కంపెనీ తాజాగా మార్కెట్లోకి లాంచ్ చేసిన ప్రొడక్టుల్లో క్లాసిక్, క్రూయిజర్, స్ట్రీట్ నేక్డ్ స్పోర్ట్స్‌స్టర్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. SRC 250, SRC 500 క్లాసిక్ మోడల్స్ కాగా, SRV 300 క్రూయిజర్, SRK 400 స్ట్రీట్ నేకెడ్ స్పోర్ట్‌స్టర్ సెగ్మెంట్‌కు చెందినవి. ఈ నాలుగు వెహికల్స్‌ను మోటో వోల్ట్ డీలర్షిప్స్ రిటైల్ చేస్తాయి. వీటిని రూ.10 వేలతో బుకింగ్ చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ బైక్స్ ధర, ఫీచర్లు తెలుసుకుందాం.
SRK 400
SRK 400 అనేది స్ట్రీట్ నేకెడ్ స్పోర్ట్‌స్టర్. ఇందులో 40.9 bhp, 37 nm టార్క్ ఉత్పత్తి చేసే 400cc, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ టూ-సిలిండర్ ఇంజిన్ ఉంది. ముందు 260mm ట్విన్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 240mm డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. డ్యూయల్-ఛానల్ ABS, LED DRLలతో డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్లైట్లు, స్ప్లిట్ సీట్లు, TFT కలర్ డిస్ప్లే, బ్యాక్లిట్ స్విచ్‌గేర్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఈ బైక్ 13.5-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ మోటార్ సైకిల్ ధర రూ. 3.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
SRV 300
QJ మోటార్ లాంచ్ చేసిన SRV 300 అనేది క్రూయిజర్ మోటార్‌సైకిల్. కంపెనీ దీని ధరను రూ.3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. ఇది 30.3 bhp, 26 nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 296 cc, లిక్విడ్-కూల్డ్, V-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. ముందు భాగంలో 280 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 240 mm డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABSతో కలిసి పని చేస్తుంది. ముందు వైపు అప్-సైడ్-డౌన్ (USD) ఫోర్క్‌లను, వెనుక భాగంలో ఆయిల్-డంప్డ్ షాక్‌లను అందిస్తుంది. LED లైటింగ్, డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్‌కు 13.5 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ఉంది.
SRC 500
QJ మోటార్ ఇంట్రడ్యూస్ చేసిన SRC 500 ఒక క్లాసిక్ స్టైల్ మోటార్‌సైకిల్. ఇందులో 25.5 bhp, 36 nm టార్క్ ఉత్పత్తి చేసే 480cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ముందు భాగంలో 300 డిస్క్ బ్రేక్, వెనుక 240 mm డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లకు డ్యూయల్-ఛానల్ ABS సపోర్ట్ అందిస్తున్నారు. ఇది ఫుల్ LCD డిస్ప్లేతో డ్యూయల్ ఇన్స్ట్రుమెంట్ పాడ్లతో వస్తుంది. మోటార్ సైకిల్‌కు 15.5 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీని ఉంది. దీని ధర రూ. 2.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
SRC 250
ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో ఉన్న 249cc, ఇన్-లైన్ 2-సిలిండర్ 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్.. 17.4 bhp, 17 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. మోటార్ సైకిల్ ముందు 280mm డిస్క్ బ్రేక్, వెనుక 240 mm డిస్క్ బ్రేక్ ఉంది. దీనికి డ్యూయల్-ఛానల్ ABS కూడా ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో అడ్జస్ట్మెంట్ చేయగల షాక్‌లు ఉన్నాయి. USB ఛార్జర్‌తో LCD కన్సోల్, అదనపు పిలియన్ సౌకర్యం కోసం ఇది పొడవైన, ఫ్లాట్ సీటును అందిస్తోంది. ఇది 14 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీని అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto, Bike, Motorcycle