Home /News /business /

Qalara: రిలయన్స్ అండతో 'కళారా' ప్లాట్‌ఫామ్... అంతర్జాతీయ మార్కెట్లకు భారతీయ కళాత్మక వస్తువులు

Qalara | భారతీయ కళాత్మక వస్తువుల్ని అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడానికి రిలయన్స్ అండతో 'కళారా' ప్లాట్‌ఫామ్ ఏర్పాటైంది. ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో భారతీయ కళాత్మక వస్తువుల్ని కొనొచ్చు.

  కళాత్మక వస్తువులను విదేశాల్లో విక్రయించడానికి సంబంధించి భారతదేశ అతిపెద్ద బి2బి వేదిక అయిన కళారా (www.qalara.com) రిలయన్స్ (Reliance) అండతో భారతీయ కళాత్మక ఉత్పాదనలను ప్రపంచవ్యాప్తంగా కొత్త అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఏటికొప్పాక నుంచి చెక్కబొమ్మలు, నర్సాపూర్ నుంచి క్రోచె ట్ లేస్ డ్రెస్ లు ఇప్పటికే కొత్త అంతర్జాతీయ మార్కెట్లను చేరుకున్నాయి. ఇంటి అలంకరణ, హోమ్ టెక్స్ టైల్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బొమ్మలు, కిచెన్ & డైనింగ్, బహుమతులు, అవుట్ డోర్, ఫర్నీచర్, ఇంకా మరెన్నో రకాలకు చెందిన 75,000కు పైగా కళాత్మక ఉత్పాదనలను భారతదేశం నలుమూలల నుంచి కళారా ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

  బహుమతులు, హస్తకళల వేడుకలకు సంబంధించి ఆసియాకు చెందిన అతిపెద్ద వేడుక అయిన ఐహెచ్ జిఎఫ్ (IHGF) అక్టోబర్ 31 వరకు జరుగనుంది. ఈ సందర్భంగా కళారా తన బి2బి వేదికను ఇక్కడ ప్రదర్శించనుంది. ఇది భారతీయ కళాకారులకు, డీలర్లకు లబ్ధి చేకూర్చనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే కొనుగోలుదారులను చేరుకోవడంలో తోడ్పడనుంది.

  Dhanteras 2021: ధంతేరాస్ రోజున బంగారం కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే

  artisanal products, Channapatna toys, Chinnamalai handloom-woven kitchen towels, Etikopakka Wooden toys, Gifts and Handicrafts Fair, Indian artisanal products, Narsapur Crochet lace, Qalara platform, Reliance, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, కళారా ప్లాట్‌ఫామ్, నర్సాపూర్ లేస్, భారతీయ కళలు, భారతీయ కళాత్మక వస్తువులు, రిలయన్స్

  పలు భారతీయ హస్తకళా ఉత్పాదనలు అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకోవడంలో కళారా తోడ్పడింది. చిన్నమలైకి చెందిన చేనేత కిచెట్ టవల్స్ లాస్ ఏంజెల్స్ కు చేరుకున్నాయి. ఒడిషా లోని మయూర్ భంజ్ తో పాటుగా పశ్చిమబెంగాల్ కు చెందిన సబాయి గ్రాస్ ప్లేస్ మెంట్స్ హాంకాంగ్ కు వెళ్లాయి. మణిపూర్ కు చెందిన లాంగ్ పి కుండలు ఇప్పుడు కెనడా స్టోర్స్లో లభ్యమవుతాయి. చెన్నపట్న బొమ్మలు సింగపూర్ లో దొరుకుతాయి. సహరాన్ పూర్ కు చెందిన చేతితో చెక్కిన చెక్క అలంకరణ వస్తువులు మారిషస్ కు వెళ్లా యి. ఒడిషాకు చెందిన హ్యాండ్ పెయింటెడ్ పట్టాచిత్రలు లండన్ దుకాణాల్లో లభిస్తాయి. ఆగ్రాకు చెందిన, చేతితో తయారు చేసిన బర్నర్లు యూకే స్టోర్స్ లో ఉన్నాయి. జైపూర్ కు చెందిన సంప్రదాయక ఆభరణా లు యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్ఏలతో సహా మరెన్నో దేశాలకు ఎగుమతి అయ్యాయి.

  Dhanteras 2021: ధంతేరాస్‌కు బంగారం కొంటారా? రూ.10,000 డిస్కౌంట్‌తో లభిస్తున్న గోల్డ్

  artisanal products, Channapatna toys, Chinnamalai handloom-woven kitchen towels, Etikopakka Wooden toys, Gifts and Handicrafts Fair, Indian artisanal products, Narsapur Crochet lace, Qalara platform, Reliance, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, కళారా ప్లాట్‌ఫామ్, నర్సాపూర్ లేస్, భారతీయ కళలు, భారతీయ కళాత్మక వస్తువులు, రిలయన్స్

  600కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా తయారీ సంస్థలు, హస్తకళాకారులు, తయారీదారులు, ఎగుమతిదారులు కళారా వద్ద నమోదయ్యారు. కళారా 50కిపైగా దేశాల నుంచి వేలాది మంది నమోదిత కొనుగోలుదారులను కలిగిఉంది. ఏడాదికంటే తక్కువ సమయంలోనే బి2బి షిప్ మెంట్స్ 40కిపైగా దేశాలకు వెళ్లాయి. వివిధ ప్రాంతాల్లో వినియోగదారుల డిమాండ్, ఉత్పాదన, ప్రైసింగ్ ధోరణులను అర్థం చేసుకునేందుకు డేటా, సాంకేతికతల సమ్మేళనాన్ని కళారా ఉపయోగిస్తుంది. అంతేగాకుండా భారతీయ కళాత్మక వస్తువులకు మార్కెటింగ్, విక్రయ అవకాశాలను పెంచుకునేందుకు గాను ఆ సమాచారాన్ని తిరిగి కళాకారులకు అందిస్తుంది.

  LPG Gas Cylinder Price: సిలిండర్ ధర రూ.1,000 దాటుతుందా? నాలుగు రోజుల్లో ఏం జరగబోతోంది?

  artisanal products, Channapatna toys, Chinnamalai handloom-woven kitchen towels, Etikopakka Wooden toys, Gifts and Handicrafts Fair, Indian artisanal products, Narsapur Crochet lace, Qalara platform, Reliance, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, కళారా ప్లాట్‌ఫామ్, నర్సాపూర్ లేస్, భారతీయ కళలు, భారతీయ కళాత్మక వస్తువులు, రిలయన్స్

  రిలయన్స్ అండతో కళారా, సరఫరా చెయిన్, సోర్సింగ్, ప్రోడక్ట్ డెవలప్ మెంట్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు, డేటా సైన్సెస్, సాంకేతికతలను సమ్మిళితం చేస్తోంది. అది విశిష్టమైన బి2బి అంతర్జాతీయ సాంకేతిక వేదిక. వేలాది ఉత్పాదనలకు సంబంధించి మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ, ధరలు, లీడ్ టైమ్స్, సప్లయ్ చెయిన్ ఆవశ్యకతలు లాంటివాటిని ఇది వివిధ దేశాల వారీగా, వాయుమార్గం, సముద్రమార్గం పరిగణనలోకి తీసుకుంటూ లెక్కిస్తుంది. ఆర్డర్ పై తయారు చేయడం, కస్టమైజేషన్, సరైన సమయంలో పంపడం లాంటి పలు ఫుల్ ఫిల్ మెంట్ మోడల్స్ ను అందిస్తుంది. పలు రకాల అంతర్జాతీయ చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Reliance

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు