PwC India: రూ.1600 కోట్ల పెట్టుబడులు... 10,0‌‌‌‌‌‌00 ఉద్యోగాలు... ప్రకటించిన పీడబ్ల్యూసీ ఇండియా

PwC India: రూ.1600 కోట్ల పెట్టుబడులు... 10,0‌‌‌‌‌‌00 ఉద్యోగాలు... ప్రకటించిన పీడబ్ల్యూసీ ఇండియా (ప్రతీకాత్మక చిత్రం)

PwC India | గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన పీడబ్ల్యూసీ ఇండియా భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 10,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది.

  • Share this:
గ్లోబల్​ కన్సల్టెన్సీ సర్వీసులను అందించే ప్రైస్​ వాటర్​ కూపర్స్​ (పీడబ్ల్యూసీ) ప్రపంచంలోనే అగ్ర సంస్థల్లో ఒకటిగా పేరొందింది. విదేశాల్లో భారీ వ్యాపారాలు కలిగిన ఈ సంస్థ ఇప్పడు భారత్​లోనూ విస్తరించేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా రాబోయే ఐదేళ్లలో భారత్​లో వ్యాపార విస్తరణ కోసం రూ.1600 కోట్లతో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడులతో రాబోయే ఐదేళ్లలో అదనంగా 10,0‌‌‌‌‌‌00 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. వీరిని క్యాంపస్ ప్లేస్​మెంట్ల ద్వారా నియమించుకోనున్నట్లు తెలిపింది. డిజిటల్​, క్లౌడ్​, సైబర్​, అనలిటిక్స్​ వంటి ఎమర్జింగ్​ టెక్నాలజీల​లో ఈ రిక్రూట్​మెంట్ ఉంటుందని పేర్కొంది. ‘ది న్యూ ఈక్వేషన్​’ పేరుతో నూతన వ్యాపార వ్యూహాన్ని ప్రకటించిన సందర్భంగా సంస్థ ఈ విషయాలను వెల్లడించింది.

ATM New Rule: ఏటీఎంలో డబ్బులు లేవా? రూ.10,000 ఫైన్ చెల్లించనున్న బ్యాంకులు

Toll Plaza: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలో హైవేలపై టోల్ ప్లాజాలు ఉండవు

మారుతున్న బిజినెస్​ స్ట్రాటజీలకు అనుగుణంగా తమ స్టాక్​ హోల్డర్స్​, వ్యాపార భాగస్వాములతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. "భారతదేశం బలమైన ఆర్థిక మూల సిద్ధాంతాలను కలిగి ఉంది. మా క్లయింట్లకు భారీ ప్రయోజనాలు, ఆవిష్కరణను పెంచడానికి ఈ కొత్త వ్యూహం ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశ ఆర్థికాభివృద్ధిని మరింతగా పెంచడానికి, దేశీయ మార్కెట్​ సామర్థ్యాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎక్కువ అవకాశాలను సృష్టించడానికి మా కొత్త వ్యూహం వీలు కల్పిస్తుంది.” అని PwC ఇండియా ఛైర్మన్ సంజీవ్ క్రిషన్ తెలిపారు. ప్రస్తుతం, ఈ సంస్థకు భారతదేశంలో 15,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాగా, సంస్థ తన ఉద్యోగులు, భాగస్వాముల స్కిల్​ డెవలప్​మెంట్​ కోసం ఆదాయంలో కనీసం 1 శాతం వెచ్చిస్తోంది.

UGC NET 2021: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది... ఒకేసారి రెండు పరీక్షలు

Life Insurance: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు... 100 ఏళ్ల వరకు కవరేజీ ఇచ్చే పాలసీ

రాబోయే ఐదేళ్లలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు


పిడబ్ల్యుసి ఇండియా రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రస్తుతమున్న టెక్ భాగస్వాములతో వ్యాపారాన్ని విస్తరించడానికి, ఎమర్జింగ్​ టెక్నాలజీల​తో కొత్త మార్గాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ సంస్థ నియమించుకునే ఉద్యోగుల్లో కనీసం 40 శాతం జెండర్​ డైవర్సిటీ పాటించాలని నిర్ణయించింది. తద్వారా పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ సంస్థ తన ఉద్యోగులు, భాగస్వాముల అభ్యున్నతి కోసం మొత్తం ఆదాయంలో 1 శాతం ఆదాయాన్ని ఖర్చు చేస్తూనే ఉంది. పీడబ్ల్యూసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగులు, క్లయింట్లకు​ ఎమర్జింగ్​ టెక్నాలజీల​పై శిక్షణ ఇస్తుంది. PwC ప్రపంచవ్యాప్తంగా 155 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థలో 2,84,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: