ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!

ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన 'భావి సంపన్నుల' జాబితాలో ఇద్దరు తెలుగువాళ్లు ఉండటం అరుదైన గౌరవం. ఈ జాబితాలో పీవీ సింధుతో పాటు, ఉపాసన కామినేనికి చోటు లభించింది.

news18-telugu
Updated: September 25, 2018, 2:03 PM IST
ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!
image: Forbes India
  • Share this:
'ఫోర్బ్స్ ఇండియా టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు, అపోలో లైఫ్ వైస్ ఛైర్మన్ ఉపాసన కామినేనికి చోటు లభించింది. ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన 'భావి సంపన్నుల' జాబితా ఇది. ఇందులో భారతదేశానికి చెందిన 22 మంది యువ సంచలనాలు ఉండటం విశేషం. క్రీడాకారులు, సినిమా నటులు, వ్యాపారవేత్తలు, ఆంట్రప్రెన్యూర్స్‌ లాంటి వివిధ రంగాలకు చెందిన వారిని టైకూన్స్ ఆఫ్ టుమారోగా ఫోర్బ్స్ గుర్తించింది. ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన 'భావి సంపన్నుల' జాబితాలో ఇద్దరు తెలుగువాళ్లు ఉండటం విశేషం. నికర సంపద విలువతో పాటు పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ జాబితా రూపొందించారు.

చైనా, టర్కీ, ఇండియా... ఏ దేశమైనా కొత్తగా పుట్టుకొస్తున్న కోటీశ్వరులు ఆయా దేశాల అభివృద్ధికి, పారిశ్రామికీకరణకు ఎంతగానో ఉపయోగపడుతుంటారు. వీరి వ్యాపారం ప్రపంచమంతా విస్తరిస్తుంది కాబట్టి ప్రజా శ్రేయస్సుతో పాటు, మరిన్ని ఉద్యోగాలను సృష్టించే బాధ్యత అంతా... సంపద సృష్టిస్తున్న ఈ వ్యాపారులపై ఉంటుంది.

బ్రియాన్ కార్వాల్హో, ఎడిటర్, ఫోర్బ్స్ ఇండియా


ఎస్ బ్యాంక్ సీఈఓ రానా కపూర్ కూతురు రాధాకపూర్ ఖన్నా, పార్లీ ఆగ్రో ఫేమ్‌కు చెందిన నదియా చౌహాన్, ఇడ్ ఫ్రెష్ ఫుడ్ కో ఫౌండర్ పీసీ ముస్తఫా, ఫ్రెష్ వర్క్స్ ఫౌండర్ గిరీష్ మాతృభూతమ్, జిరోధా కో-ఫౌండర్లు నిఖిల్ కామత్, నితిన్ ఖామత్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్‌కు చెందిన అమీరా షా, బిబా అపారెల్‌కు చెందిన సిద్ధార్థ్ బింద్రా, సియట్‌కు చెందిన అనంత్ గోయెంకా, యూపీఎల్‌కు చెందిన విక్రమ్ ష్రాఫ్, లోధా గ్రూప్‌కు చెందిన అభిషేక్ లోధా, క్లియర్ ట్యాక్స్ ఫౌండర్ అర్చిత్ గుప్తా, మ్యాసీవ్ రెస్టారెంట్స్ ఫౌండర్ జోరావర్ కాల్రా, సినీ నటులు విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, బిరా 91 బీర్ ఫౌండర్ అంకుర్ జైన్, ఓయో రూమ్స్‌కు చెందిన రితేష్ అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు.

ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!, pv sindhu and upasana kamineni in 'Forbes India Tycoons of Tomorrow' list

భారతదేశ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుతున్న ప్రభావవంతమైన యువ సాధకుల టాలెంట్‌ను గుర్తించి ఫోర్బ్స్ ఇండియా టైకూన్స్ ఆఫ్ టుమారో జాబితా రూపొందించారు. భావి తరాలకు వీళ్లంతా స్ఫూర్తిగా నిలుస్తారని విశ్వసిస్తున్నాం. అంతేకాదు... ఫోర్బ్స్ ఇండియా రూపొందించే మిగతా జాబితాల్లో కూడా వీరి పేర్లు కనిపిస్తాయని ఆశిస్తున్నాం.
జాయ్ చక్రవర్తి, సీఈఓ, ఫోర్బ్స్ ఇండియా, రెవెన్యూ, నెట్‌వర్క్ 18


ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన 'భావి సంపన్నుల' జాబితాలో ఎంపికైన వారందర్నీ సెప్టెంబర్ 25 సాయంత్రం నిర్వహించనున్న కార్యక్రమంలో సన్మానించనున్నారు. ఫేస్‌బుక్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది. పలు అంశాలపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. 'బిల్డింగ్ టుమారోస్ ఇండియా' అంశంపై జరిగే ప్యానల్ డిస్కషన్‌లో ఉపాసన కామినేని పాల్గొననున్నారు. 'ఒలింపిక్ నేషన్‌ వైపు ఇండియా అడుగులు' అన్న అంశంపై జరిగే చర్చలో పీవీ సింధు, అభినవ్ బింద్రా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఇక 'ఛేంజింగ్ క్యారెక్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇన్ ఇండియన్ సినిమా' అంశంపై విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ చర్చించనున్నారు. రాణీ ముఖర్జీ, రణ్‌వీర్ సింగ్ లాంటివాళ్లు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...


ఇవి కూడా చదవండి:

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

క్రెడిట్ కార్డులో ఈ ఛార్జీలు మీకు తెలుసా?

క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

డేంజరస్ గేమ్స్‌పై పోరాటానికి ఆన్‌లైన్ గేమ్!

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!
Published by: Santhosh Kumar S
First published: September 25, 2018, 1:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading