Electric Scooter Offer | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వాటి ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్లు ప్రకటించాయి. భారీ తగ్గింపు అందిస్తున్న రూ.10 వేల వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ నెల చివరి వరకే అందుబాటులో ఉంటాయి. ఓలా (Ola), ఏథర్ (Ather) వంటి కంపెనీలు ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో కంపెనీ కూడా వీటి జాబితాలోకి వచ్చి చేరింది.
ప్యూర్ ఈవీ కూడా ఆఫర్లు అందిస్తోంది. ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 20 వేల వరకు తగ్గింపు ప్రయోజాలు అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని కంపెనీ తన వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. ఇది పరిమిత కాల ఆఫర్ అని కంపెనీ పేర్కొంటోంది. అయితే ఏ ఏ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మాత్రం కంపెనీ వివరంగా తెలియజేయలేదు. దీని కోసం కంపెనీ ఎంక్వైరీ ఫామ్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో మీ వివరాలు అందిస్తే.. ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
కొత్త స్కీమ్ తెచ్చిన బ్యాంక్.. కస్టమర్లకు అదిరే శుభవార్త, రూ.5 వేలు ఉంటే చాలు..
అందువల్ల మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనే ప్లానింగ్ ఉంటే మాత్రం ఈ ఆఫర్లును సద్వినియోగం చేసుకోవచ్చు. ప్యూర్ ఈవీ కంపెనీ పలు రకాల మోడళ్లను అందుబాటులో ఉంచింది. ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండింటినీ అందిస్తోంది. ఎకో డ్రిఫ్ట్, ఇట్రిస్ట్ 350 పేరుతో ఎలక్ట్రిక్ బైక్స్‌ను అందుబాటులో ఉంచింది. అలాగే ఇప్లుటో 7జీ, ఎంట్రెనస్ నియో వంటి పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. అందువల్ల మీకు నచ్చిన టూవీలర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మోడల్ ప్రాతిపదికన ధర, ఫీచర్లు మారుతూ ఉంటాయి. అలాగే కంపెనీ తన మోడళ్లపై ఎక్సెంటెండ్ బ్యాటరీ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది.
రూ.లక్షకు ఏడాదిలోనే రూ.2 లక్షల 80 వేలు.. కాసుల వర్షం కురిపించిన 7 బ్యాంకులు!
ఇకపోతే ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 10 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు ఇది వర్తిస్తుంది. ఈ నెల చివరి వరకే ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేయాలని భావించే వారు ఓలా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఏథర్ కూడా పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ రెండు కంపెనీలు సులభ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంచాయి. జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో వడ్డీ వంటి ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నాయి. అందువల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ather, Electric Scooter, Electric Vehicles, Ola electric, Ola Electric Scooter