PUNJAB NATIONAL BANK ORIENTAL BANK OF COMMERCE AND UNITED BANK WILL BE MERGED MK
Public sector banks merger: దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రతీకాత్మక చిత్రం
Public sector banks merger: ఈ విలీనంతో పీఎన్బీ దేశవ్యాప్తంగా మొత్తం 11431 బ్రాంచీలుగా విస్తరించనుంది. రానున్న 5 సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించేందుకు బ్యాంకింగ్ రంగంలో కీలక విలీన ప్రతిపాదనలు ప్రకటించారు.
Public sector banks merger: పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా మొత్తం దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ విలీనంతో పీఎన్బీ దేశవ్యాప్తంగా మొత్తం 11431 బ్రాంచీలుగా విస్తరించనుంది. రానున్న 5 సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించేందుకు బ్యాంకింగ్ రంగంలో కీలక విలీన ప్రతిపాదనలు ప్రకటించారు. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ పీఎస్యూ బ్యాంకుల విలీనం పై వ్యాఖ్యానించారు.ఇందులో భాగంగా విలీన ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు. వినియోగదారులకు ఎలాంట ఇబ్బంది కలగకుండా విలీనం జరుగుతుందని తెలిపారు.
అలాగే బ్యాంకులకు ఆర్థిక ఉద్దీపన కలిపించేందుకు కాపిటల్ ఇన్ఫ్యూజన్ ప్రకటిస్తూ నిర్మలా ప్రకటించారు. మొత్తం రూ.55,000 కోట్లను ప్రభుత్వ బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకులకు అందించిన రీకాపిటలైజేషన్ మొత్తంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాటా రూ.16,000 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.11,700 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 7000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.2500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రూ.3800 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ రూ. 3300 కోట్లు, యూకో బ్యాంక్ రూ.2100 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ రూ.1600 కోట్లు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ రూ.750 కోట్లు...
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.