హోమ్ /వార్తలు /బిజినెస్ /

PNB Credit Card: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్‌.. బోలెడు లాభాలు..

PNB Credit Card: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్ లాంచ్‌.. బోలెడు లాభాలు..

PNB Credit Card

PNB Credit Card

PNB Credit Card: శాలరీ అకౌంట్‌ కస్టమర్లకు ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వారు మొబైల్ బ్యాంకింగ్ యాప్ పీఎన్‌బీ వన్‌(PNB One), వెబ్‌సైట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్(IBS) ద్వారా కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇన్సూరెన్స్‌ కవరేజీ సహా అనేక ఫీచర్లతో ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్‌ (Credit Card)ను లాంచ్‌ చేసింది. కొన్ని క్లిక్‌లు, OTP(వన్-టైమ్ పాస్‌వర్డ్)తో పీఎన్‌బీ వన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌(Fixed Deposit)పై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. శాలరీ అకౌంట్‌ కస్టమర్లకు ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వారు మొబైల్ బ్యాంకింగ్ యాప్ పీఎన్‌బీ వన్‌(PNB One), వెబ్‌సైట్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్(IBS) ద్వారా కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. రెండు పేమెంట్‌ గేట్‌వేలు రూపే(Rupay), వీసా (Visa) ద్వారా బ్యాంక్ ఈ సేవలను అందిస్తోంది. కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించకుండానే లోన్ పొందవచ్చు. పీఎన్‌బీ వన్‌ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దరఖాస్తు చేసినప్పుడు వడ్డీ రేటుపై 0.25 శాతం రాయితీ ఉంటుందని బ్యాంకు పేర్కొంది.


* డిజిటల్‌ సేవల అభివృద్ధికి అడుగులు
పీఎన్‌బీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అతుల్ కుమార్ గోయెల్ మాట్లాడుతూ..‘డిజిటల్ సౌండ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌ను నిర్మించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఇన్‌స్టంట్‌, అవాంతరాలు లేని సేవలను అందించే దిశగా మరో అడుగు వేస్తున్నాం. పీఎన్‌బీ కొత్త ప్రీ-క్వాలిఫైడ్ క్రెడిట్ కార్డ్ సేవలను పూర్తిగా డిజిటల్, కన్సెంట్‌ బేస్డ్, పేపర్‌లెస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా అందిస్తోంది.’ అని పేర్కొన్నారు.నమోదు చేసిన వివరాల ఆధారంగా, కస్టమర్లు ఎగ్జైటింగ్ రివార్డ్ పాయింట్‌లు, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ & ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్, హెల్త్ చెక్, కాంప్లిమెంటరీ గోల్ఫ్, స్పా, జిమ్ సెషన్స్, హయ్యర్ క్రెడిట్ లిమిట్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్‌లను పొందుతారని గోయెల్ తెలిపారు.


కొన్ని క్లిక్‌ల ద్బారా పీఎన్‌బీ ఒన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఇది డిజిటల్ ప్రస్థానానికి తోడవుతుందని, సాధారణ ప్రజల అవసరాలను లక్ష్యంగా చేసుకున్నందుకు రెండు ప్రొడక్టులపై ఆశాజనకంగా ఉన్నామని వివరించారు.


ఇది కూడా చదవండి : ప్రైవేట్ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్.. NPS కాంట్రిబూషన్‌ రూల్స్, స్కీమ్ బెనిఫిట్స్ తెలుసుకోండి..


* పెరిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ గత వారం ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త పీన్‌బీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇవి ఇప్పటికే అమలులోకి వచ్చాయి. పీఎన్‌బీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న వాటికి అమలు అయ్యాయి. బ్యాంకు ప్రత్యేకంగా అందిస్తున్న 1111 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌పై మాత్రం వడ్డీ రేటు పెంచలేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Credit card, Fixed deposits, Insurance, Personal Finance, Punjab National Bank

ఉత్తమ కథలు