Home /News /business /

PUNJAB NATIONAL BANK HIKES INTEREST RATES ON FIXED DEPOSITS OF 1 TO 10 YEARS UMG GH

Interest rates: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ (Interest) రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఈ బ్యాంక్ జూన్ 14న ప్రకటన విడుదల చేసింది. ఒక సంవత్సరం నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై PNB వడ్డీ రేట్లను ?

ఇంకా చదవండి ...
ఆర్బీఐ ఇటీవల రెపో రేటును రెండుసార్లు పెంచిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ప్రముఖ బ్యాంకులు అన్నీ రుణ రేట్లతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB).. మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ఈ బ్యాంక్ జూన్ 14న ప్రకటన విడుదల చేసింది. ఒక సంవత్సరం నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై PNB వడ్డీ రేట్లను పెంచింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజా FD రేట్లు
7 నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు.. 46 నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. 91 నుంచి 179 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ, 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ఇది గతంలో 5.10 శాతంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది.



రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 5.10 శాతం ఉండగా.. 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. మూడు నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై బ్యాంక్ ప్రస్తుతం 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. గతంలో ఇది 5.25 శాతం ఉండగా, 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు చేసే డిపాజిట్లపై తాజా వడ్డీ రేటు 35 bps పెరిగి, 5.60 శాతానికి చేరుకుంది. ఇంతకు ముందు ఇది 5.25 శాతంగా ఉంది. పీఎన్‌బీ కొత్తగా 1111 రోజుల కాలవ్యవధితో డిపాజిట్లు అందిస్తోంది. ఈ గడువులో రెగ్యులర్ కస్టమర్లకు 5.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఇదీ చదవండి: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. సంవత్సరంలో నాలుగు సార్లే ఆ ఆప్షన్..!


సీనియర్ సిటిజన్లకు బ్యాంకు అదనపు వడ్డీ రేట్లు అందిస్తోంది. “సీనియర్ సిటిజన్లు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే దేశీయ డిపాజిట్లపై అన్ని మెచ్యూరిటీలకు 50 bps అదనపు వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్‌లు అయిన సిబ్బందితో పాటు రిటైర్డ్ సిబ్బందికి గరిష్ట వడ్డీ రేటు 150 bps ఉంటుంది. అయితే PNB టాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ విషయంలో గరిష్ట వడ్డీ రేటు 100 bps మాత్రమే ఉంటుంది" అని బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Published by:Mahesh
First published:

Tags: Bank, FD rates, Fixed deposits, Punjab National Bank

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు