బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే సరిపోదు. ఎప్పటికప్పుడు నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకు కస్టమర్లు అందరూ తమ కేవైసీ వివరాలను బ్యాంకులో అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకపోతే అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేయడమో లేదా బ్లాక్ చేయడమో తప్పదు. అందుకే ఖాతాదారులు తమ కేవైసీ వివరాలు అప్డేట్గా ఉన్నాయో లేదో తెలుసుకొని, బ్యాంకులో కేవైసీ అప్డేట్ (KYC Update) చేయిస్తూ ఉండాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ బ్యాంకు కస్టమర్లను కేవైసీ అప్డేట్ చేయాలని కోరుతోంది. 2022 డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేయించకపోతే అకౌంట్ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తోంది.
ఆర్బీఐ నియమనిబంధనల ప్రకారం ఖాతాదారులు తప్పనిసరిగా కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని, కేవైసీ అప్డేట్ చేయడం కోసం బ్యాంకు కాల్స్ చేయదని, కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అడగదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2022 సెప్టెంబర్ 30 లోగా కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని, ఇప్పటికే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పలు నోటీసులు, ఎస్ఎంఎస్ పంపామని, 2022 డిసెంబర్ 12 లోగా మీ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేయాలని, లేకపోతే అకౌంట్ కార్యకలాపాలపై ఆంక్షలు ఉంటాయని బ్యాంకు తెలిపింది.
New Rules: నేటి నుంచి 7 కొత్త రూల్స్... మీ డబ్బుపై ప్రభావం చూపించేవి ఇవే
Points to be noted ???????? Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL
— Punjab National Bank (@pnbindia) November 20, 2022
ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ చేయడానికి పాన్ నెంబర్ , ఐడెంటిటీ ప్రూఫ్, ఇటీవల తీసుకున్న ఫోటో, ఇన్కమ్ ప్రూఫ్, ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ లాంటి వివరాలు బ్యాంకులో సమర్పించాలి. ఇలా ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలు అప్డేట్ చేస్తూ ఉంటే అకౌంట్ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేయొచ్చు. లేదా ఇమెయిల్ ద్వారా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాదు, దాదాపు అన్ని బ్యాంకులకు కేవైసీ అప్డేట్ ప్రాసెస్ దాదాపుగా ఇలాగే ఉంటుంది.
LIC New Plan: రోజుకు రూ.20 లోపు ప్రీమియం... కోటి రూపాయల ఇన్స్యూరెన్స్
ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు కస్టమర్లు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు, అనుమానాస్పద కార్యకలాపాలు, పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్స్ లాంటివాటిపై నిఘా పెట్టాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. అందులో భాగంగా కస్టమర్ల కేవైసీ వివరాలు అప్డేట్గా ఉండేలా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. కస్టమర్ల ఐడెంటిటీని గుర్తించేందుకు కేవైసీని ఉపయోగిస్తాయి బ్యాంకులు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు తమ కేవైసీ పెండింగ్‌లో ఉందో లేదో తెలుసుకోవడానికి వారి బ్రాంచ్‌కు వెళ్లొచ్చు. లేదా కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.