హోమ్ /వార్తలు /బిజినెస్ /

LPG Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త!

LPG Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త!

 LPG Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త!

LPG Cylinder Price: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. రేషన్ కార్డు ఉంటే చాలు, ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త!

Gas Cylinder Price | గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం అదిరే ప్రకటన చేసింది. సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

LPG Cylinder Subsidy | గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సిలిండర్ కొనాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇటీవలనే ఎల్‌పీజీ సిలిండర్ (LPG) ధరలను రూ. 50 మేర పెంచాయి. మార్చి 1 నుంచి ఈ రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. దీంతో దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (Cylinder Rate) ధరలు ఆకాశాన్నితాకాయి. దీని వల్ల సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గ్యాస్ బండ గుది బండలా తయారైంది.

అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పుదుచ్చేరి ప్రభుత్వం అదిరిపోయే ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్రజలకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కొనుగోలుపై తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. సబ్సిడీ రూపంలో ప్రజలకు భారీ డిస్కౌంట్ అందిస్తామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త కారు కొనే వారికి శుభవార్త.. రూ.3 లక్షల డిస్కౌంట్, మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు!

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌పై సబ్సిడీ అందిస్తామని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ అందిస్తామని వెల్లడించింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తానికి వేళ అక్కడి ప్రభుత్వం ఈ మేరకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రటకన చేయడం గమనార్హం. దీని వల్ల ప్రజలకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఎస్‌బీఐ .. ఉగాది పండుగ ముందు కీలక నిర్ణయం, రేపటి నుంచి..

కాగా ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే.. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 1150 దాటి పోయింది. ఏపీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. అంటే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ఇంటికి రావాలంటే జేబులో నుంచి దాదాపు రూ. 1200 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే సిలిండర్ ధరలు ఏ స్థాయిలో పెరిగిపోయాలో అర్థం చేసుకోవచ్చు.

గ్యాస్ సిలిండర్ ధరల ఒక వైపు పెరగుతూపోతే.. మరో వైపు మోదీ సర్కార్ మాత్రం గ్యాస్ సిలిండర్ సబ్సిడీని కూడా ఎత్తివేసింది. గతంలో సిలిండర్ ధర పెరిగితే అందుకు అనుగుణంగా సబ్సిడీ కూడా పెరిగేది. అయితే ఇప్పుడు సిలిండర్ ధర కొండెక్కినా కూడా సబ్సిడీ మాత్రం రావడం లేదు. అంటే ప్రజలకు చాలా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఇలా గ్యాస్ సిలిండర్ ధరలపై సబ్సిడీ లేదా తగ్గింపు ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీని వల్ల సామాన్యులకు చాలా ఊరట లభిస్తుంది.

First published:

Tags: LPG, Lpg connection, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price

ఉత్తమ కథలు