Loan in 59 minutes: 59 నిమిషాల్లో హోమ్ లోన్, కార్ లోన్ ఇవ్వనున్న బ్యాంకులు

Loan in 59 minutes | ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) మాత్రమే రూ.1 కోటి వరకు 59 నిమిషాల్లో రుణాలు ఇస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. త్వరలో కారు, ఇంటి రుణాలను కూడా ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి.

news18-telugu
Updated: August 21, 2019, 10:26 AM IST
Loan in 59 minutes: 59 నిమిషాల్లో హోమ్ లోన్, కార్ లోన్ ఇవ్వనున్న బ్యాంకులు
Loan in 59 minutes: 59 నిమిషాల్లో హోమ్ లోన్, కార్ లోన్ ఇవ్వనున్న బ్యాంకులు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 21, 2019, 10:26 AM IST
ఒకప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే ఎన్ని రోజుల సమయం పట్టేదో గుర్తుందా? రెండుమూడేళ్ల క్రితం వరకు కూడా లోన్ తీసుకోవాలంటే కొన్నివారాలు వెయిట్ చేయాల్సి వచ్చేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు ప్రతినిధులు వెరిఫికేషన్‌కు రావడం, ఆ తర్వాత లోన్ అప్రూవ్ కావడం, అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవడం ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మానవ ప్రమేయం తగ్గిపోతోంది. సులువుగా రుణాలు వచ్చేస్తున్నాయి. అన్నీ పక్కాగా ఉంటే కొన్ని గంటల్లో లోన్ సాంక్షన్ అవుతోంది. డబ్బులు అకౌంట్‌లో పడిపోతున్నాయి. ఇప్పుడు రుణాలు తీసుకోవడం ఇంకా సులువైపోయింది. గంటలు కాదు... నిమిషాల్లో రుణాలు మంజూరవుతున్నాయి. కేవలం 59 నిమిషాల్లో రూ.1 కోటి వరకు బిజినెస్ లోన్ మంజూరు అవుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. https://www.psbloansin59minutes.com వెబ్‌సైట్ ఇంత వేగంగా రుణాలను మంజూరు చేస్తోంది.

ప్రస్తుతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) మాత్రమే రూ.1 కోటి వరకు 59 నిమిషాల్లో రుణాలు ఇస్తున్నాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంకులు రూ.5 కోట్ల వరకు మంజూరు చేస్తున్నాయి. త్వరలో కారు, ఇంటి రుణాలను కూడా ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరిన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు త్వరలోనే రుణాలను https://www.psbloansin59minutes.com ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇవ్వబోతున్నాయి.

గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన '59 నిమిషాల లోన్' స్కీమ్‌ ద్వారా రూ.25 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారులకు రూ.5 కోట్ల వరకు రుణాలను గంట లోపే మంజూరు చేస్తున్నాం. అయితే ఈ ప్లాట్‌ఫామ్ గురించి అవగాహన తక్కువగా ఉండటంతో వ్యాపారులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈ స్కీమ్ ద్వారా ఆటో లోన్స్ ముఖ్యంగా కార్ లోన్స్‌కు అమలు చేసే ఆలోచనలో ఉన్నాం.

రజ్‌నీష్ కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్




గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఈ వెబ్‌సైట్ ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) ప్రభుత్వ రంగ బ్యాంకులు 59 నిమిషాల్లోనే బిజినెస్ లోన్స్ మంజూరు చేయడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యం. 2019 మార్చి నాటికి 50,706 లోన్ దరఖాస్తులకు ఆమోదముద్ర పడగా, 27,893 దరఖాస్తులకు రుణాలు మంజూరయ్యాయి. ఇప్పటికే వేల కోట్ల రుణాలను కేవలం గంటలోపే మంజూరు చేసి రికార్డ్ సృష్టిస్తోంది ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్-GST పేమెంట్స్, ఆదాయపు పన్ను చెల్లింపులు, క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్స్‌ని ఆల్గరిథమ్ ద్వారా విశ్లేషించి రుణాలు మంజూరు చేస్తోంది ఈ ప్లాట్‌ఫామ్. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో హోమ్ లోన్, ఆటో లోన్స్‌ లాంటి రీటైల్ ప్రొడక్ట్స్‌ని https://www.psbloansin59minutes.com ప్లాట్‌ఫామ్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు భావిస్తున్నాయి.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి
Loading...

ఇవి కూడా చదవండి:

LIC Policy: ఎల్ఐసీ పాలసీ నచ్చలేదా? వెనక్కి ఇవ్వొచ్చు తెలుసా

Railways: ట్రైన్ టికెట్‌పై 100% వరకు కన్సెషన్... ఎవరెవరికో తెలుసా?

SBI IMPS: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...