మనలో చాలా మందికి, మన నెలవారీ జీతాలు సేవింగ్స్ ఖాతాల్లోనే జమ చేయబడతాయి. అనేక పథకాల్లో పెట్టుబడులు, రుణాలు కూడా సేవింగ్స్ అకౌంట్ నుండి అందించబడతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అనేక కొత్త ప్రైవేట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందించే వడ్డీతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీరేట్లు చాలా తక్కువ. మీరు సేవింగ్స్ అకౌంట్ తెరిచే ముందు ఏ బ్యాంకులు ఎంత వడ్డీ చెల్లిస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ. ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు వారి సేవింగ్స్ ఖాతాలో వరుసగా 3.6 శాతం, 3.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు 3.10 శాతం వరకు వడ్డీని మాత్రమే అందిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందించే వడ్డీలతో పోల్చినప్పుడు ఈ వడ్డీ రేట్లు పోటీగా ఉంటాయి. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ 3 శాతం నుండి 3.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పొదుపు ఖాతాదారులకు చాలా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వరుసగా కేవలం 2.70 శాతం, 2.75 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తాయి. బిఎస్ఈ లిస్టెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను మాత్రమే ఈ డేటా కోసం తీసుకున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్స్‌లో డేటాను ప్రచారం చేయని బ్యాంకులు దీనిలో పరిగణించబడవు.
Aadhaar Card: డాక్యుమెంట్స్ లేకుండా ఆధార్ కార్డులో ఈ 5 మార్పులు చేయొచ్చు
Gold Loan: గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నారా? ఈ ఆప్షన్స్ మీకోసమే
సేవింగ్స్ అకౌంట్స్‌పై అధిక వడ్డీరేటును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులు
బ్యాంకు |
వడ్డీరేటు (శాతాల్లో) |
మినిమం బ్యాలెన్స్ |
బ్యాలెన్స్ టైప్ |
ఐడిబిఐ బ్యాంక్ |
3.1–3.6 |
రూ.500–రూ.5000 |
ఎంఏబి |
పంజాబ్ అండ్ సింథ్ |
3.1–3.5 |
రూ.500–రూ.1000 |
ఎంబి |
ఇండియన్ ఓవర్సీస్ |
3.10 |
రూ.500–రూ.1000 |
ఎంబి |
బ్యాంక్ ఆఫ్ ఇండియా |
3.00 |
రూ.500–రూ.1000 |
ఎక్యూబి |
యూనియన్ బ్యాంక్ |
3.00 |
రూ.250–రూ.1000 |
ఎంబి |
ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ తక్కువ
ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ అవసరం 250 రూపాయల నుండి మొదలవుతుంది. భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ ప్రోత్సాహంతో పనిచేస్తాయి. ఇవి ముఖ్యంగా దిగువ, మధ్యతరగతికి వారికి మెరుగైన సేవలందించడానికి ఉద్దేశించి ఏర్పాటయ్యాయి. అదే ప్రైవేటు రంగం పరిధిలో పనిచేసే యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మినిమం బ్యాలెన్స్ రూ.2,500 నుంచి రూ.10,000 వరకు, ఐసిఐసిఐ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అధిక వడ్డీ రేటు, దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్, సేవా ప్రమాణాలు, విస్తృత బ్రాంచ్ నెట్వర్క్, ఎటిఎం సేవలను దృష్టిలో ఉంచుకొని ఏ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరవాలో నిర్ణయించుకోండి.