Stock Market Today | బ్యాంక్ స్టాక్స్ అదరగొడుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ఏకంగా ఐదు బ్యాంకుల (Banks) షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి. దీంతో ఆ షేర్లలో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)క్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఏడాది గరిష్టానికి చేరాయి.
సెంట్రల్ బ్యాంక్ షేర్లు రూ. 26.45 స్థాయికి చేరాయి. గత ఆరు నెలల కాలంలో చేస్తే ఈ షేరు 46 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే ఈ షేరు 19 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 26 శాతం పైకి చేరింది. అలాగే ఇండియన్ బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ షేరు రూ. 275 స్థాయికి చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి. ఆరు నెలల కాలంలో స్టాక్ ధర రూ. 156 నుంచి రూ. 275కు చేరడం గమనార్హం. అంటే ఇన్వెస్టర్లకు 72 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఏడాది చూస్తే ఈ స్టాక్ 90 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
ఎయిర్టెల్ సిమ్ వాడే వారికి షాక్.. రీచార్జ్ ధరలను భారీగా పెంచేసిన కంపెనీ!
ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా దుమ్మురేపింది. ఈ షేరు రూ. 47.8 స్థాయికి చేరింది. ఇది ఏడాది గరిష్ట స్థాయి. ఈ ఏడాది ఈ స్టాక్ 25 శాతం రాబడిని ఇచ్చింది. ఆరు నెలల కాలంలో రూ.30 నుంచి రూ. 47కు చేరింది. అంటే 55 శాతం పైకి చేరింది. గత ఏడాది కాలంలో షేరు 19 శాతం పైకి కదిలింది.
పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఇక ఫోన్‌పే, గూగుల్ పేకు డబ్బులు పంపొచ్చు!
యూకో బ్యాంక్ విషయానికి వస్తే.. ఈ స్టాక్ రూ.18.9 స్థాయికి చేరింది. ఇది ఏడాది గరిష్ట స్థాయి. యూకో బ్యాంక్ స్టాక్ నెల రోజుల్లోనే 47 శాతానికి పైగా పెరిగింది. గత ఆరు నెలల కాలంలో చూస్తే 60 శాతానికి పైగా పెరిగింది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు రూ. 75.8 స్థాయికి చేరింది. ఇది 52 వారాల గరిష్ట స్థాయి. గత ఆరు నెలల కాలంలో ఈ షేరు 108 శాతం పెరిగింది. అంటే డబ్బును రెట్టింపు చేసింది. గత నెల రోజుల్లో షేరు ధర 55 శాతం పైకి చేరింది. కాగా స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Share Market Update, Stock Market, Stocks