బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి పెరగనున్న జీతాలు..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. సెప్టెంబరు నుంచి వారికి జీతాలు పెరగనున్నాయి. డీఏ అదనంగా 3.6 శాతం పెరగడంతో పెరిగిన జీతాలు వారి ఖాతాల్లో పడనున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 19, 2019, 12:00 PM IST
బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి పెరగనున్న జీతాలు..
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. సెప్టెంబరు నుంచి వారికి జీతాలు పెరగనున్నాయి. డీఏ అదనంగా 3.6 శాతం పెరగడంతో పెరిగిన జీతాలు వారి ఖాతాల్లో పడనున్నాయి. దీనికి సంబంధించిన ఆర్డర్‌ను ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ విడుదల చేసింది. ఉదాహారణకు ఒక ఎస్‌బీఐ పీవో బేసిక్ పే రూ.27,620 అయితే దానిపై 3.6 శాతం అధిక డీఏను అందుకోనున్నారు. అంటే.. సదరు పీవో దాదాపు రూ.1000 ఎక్కువ జీతాన్ని అందుకోనున్నారు. కాగా, ఆలిండియా యావరేజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జూన్ 2019 డేటా విడుదలైంది. దాని ప్రకారం.. ఏప్రిల్‌లో సీపీఐ 7121.68గా ఉండగా, మే లో అది రూ.7167.33కి చేరింది. జూన్‌లో అది రూ.7212.98కి ఎగబాకింది.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading