హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే రూ.1 కోటి రిటర్న్స్

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే రూ.1 కోటి రిటర్న్స్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Scheme | మీరు ప్రతీ నెలా జీతంలో కొంత డబ్బులు (Savings) దాచుకోవాలనుకుంటున్నారా? మీరు దాచుకునే డబ్బులు సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీసులో ఈ పథకంలో డబ్బులు దాచుకుంటే రూ.1 కోటికి పైగా రిటర్న్స్ పొందొచ్చు.

ఇంకా చదవండి ...

  పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలను తక్కువ అంచనా వేస్తుంటారు కానీ... దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే కొన్నేళ్లపాటు తమ పెట్టుబడుల్ని కొనసాగించే ఓపిక లేకపోవడంతో సరైన రిటర్న్స్ పొందలేకపోతుంటారు ఖాతాదారులు. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో (Small Saving Schemes) డబ్బులు దాచుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. దాచుకున్న డబ్బులు నష్టపోతామన్న భయం ఉండదు. రిస్క్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో డబ్బులు దాచుకుంటే రిటర్న్స్ గ్యారెంటీ ఉండదు. కానీ పోస్ట్ ఆఫీసులో లభించే పొదుపు పథకాల్లో (Post Office Schemes) దాచుకునే డబ్బులకు భరోసా ఉంటుంది. రిస్క్ లేని పెట్టుబడులు కోరుకునేవారికి ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయి.

  Pension Scheme: నెలకు రూ.1,78,000 పెన్షన్... ఎంత పొదుపు చేయాలో తెలుసా?

  పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund) కూడా ఒకటి. పీపీఎఫ్‌లో డబ్బులు దాచుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీపై చక్రవడ్డీ కూడా లభిస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి. మెచ్యూరిటీ గడువు 15 ఏళ్లు. అప్పటివరకు ఇందులో డబ్బులు జమ చేయాలి. మెచ్యూరిటీ తర్వాత పీపీఎఫ్ ఖాతాదారులు మరో 5 ఏళ్లు గడువు పొడిగించుకోవచ్చు. ఈ ఐదేళ్ల కాలం డబ్బులు జమ చేయాలా వద్దా అనేది అకౌంట్‌హోల్డర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. చక్రవడ్డీ బెనిఫిట్స్ పొందడానికి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.

  Online Fraud: ఆన్‌లైన్‌లో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే వెనక్కి వస్తాయి

  పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో పొదుపు చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక పీపీఎఫ్‌లో డబ్బులు దాచుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రతీ ఏటా ఒకరు గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకు గరిష్టంగా రూ.12,500 జమ చేయొచ్చు. మరి ఈ స్కీమ్‌లో ఎంత పొదుపు చేస్తే రిటర్న్స్ ఎంత వస్తాయో తెలుసుకోండి.

  పీపీఎఫ్‌లో ప్రతీ నెల రూ.12,500 చొప్పున పొదుపు చేస్తే ఏడాదికి రూ.1,50,000 అకౌంట్‌లో జమ అవుతుంది. ఇలా 15 ఏళ్ల పాటు పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు దాచుకుంటే జమ చేసిన మొత్తం రూ.22,50,000 అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం అనుకుంటే రూ.18,20,000 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.40,70,000 లభిస్తుంది.

  Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్‌తో వృద్ధాప్యంలో ఆర్థిక భరోసానిచ్చే స్కీమ్

  ఇక 25 ఏళ్ల పాటు డబ్బులు జమ చేస్తే రూ.1 కోటి పైనే రిటర్న్స్ పొందొచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌లో ప్రతీ నెల రూ.12,500 అంటే ఏడాదికి రూ.1,50,000 చొప్పున 25 ఏళ్ల పాటు డబ్బులు దాచుకుంటే జమ చేసిన మొత్తం రూ.37,50,000 అవుతుంది. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం అనుకుంటే రూ.65,58,000 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి రూ.1.03,08,000 రిటర్న్స్ పొందొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: India post, Personal Finance, Post office, Post office scheme, Postal department, PPF

  ఉత్తమ కథలు