హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Schemes: PPF vs NSC vs SSY.. ప్రస్తుతం ఈ మూడు సేవింగ్స్ స్కీమ్స్‌లో ఏది బెస్ట్? తెలుసుకోండి..

Savings Schemes: PPF vs NSC vs SSY.. ప్రస్తుతం ఈ మూడు సేవింగ్స్ స్కీమ్స్‌లో ఏది బెస్ట్? తెలుసుకోండి..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Savings Schemes: కేంద్ర ప్రభుత్వం పొదుపునకు సంబంధించి అనేక పథకాలను అందిస్తుంది. వాటిలో ప్రధానంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ పథకాలకు సంబంధించిన రాబడి, వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

భవిష్యత్తు అవసరాల కోసం చాలా మంది వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్(Invest) చేస్తుంటారు. అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్థిక లక్ష్యాలు, రాబడి, పదవీకాలం, వడ్డీ రేట్లు, నష్టాలు తదితర అంశాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే అందుబాటులో ఉన్న వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌కు సంబంధించి సరైన విశ్లేషణ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పొదుపునకు సంబంధించి అనేక పథకాలను అందిస్తుంది. వాటిలో ప్రధానంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY) ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ పథకాలకు సంబంధించిన రాబడి, వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)

దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టేవారికి ఈ పథకం సరైన ఆప్షన్. ఇది సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దీనిపై వచ్చిన వడ్డీ, రిటర్స్‌పై ఎటువంటి ట్యాక్స్ విధించరు. ఒక సంవత్సరంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని IT చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.500 కనీస పెట్టుబడితో PPF అకౌంట్‌ను ప్రారంభించవచ్చు. గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి 15 సంవత్సరాలు. ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ వద్దనుకునే వారు ఇందులో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. రాబడికి గ్యారెంటీ కూడా ఉంటుంది.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)

మంచి రాబడిని అందించే పథకాల్లో ఇది ఒకటి. సంవత్సరానికి 6.8 శాతం వడ్డీ అందిస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకాల్లో ఇది ఒకటి. ఈ పథకం పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద.. ఎన్‌ఎస్‌సీ కాంట్రిబ్యూషన్‌లో రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే, పదవీ విరమణ తర్వాత నెలవారీగా రాబడి ఉంటుంది. ఇందుకు కనీస పెట్టుబడిగా ఏడాదికి రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీస్, ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో ఉన్న వ్యక్తులు మినహా భారతీయ పౌరులందరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు.

ఇది కూడా చదవండి : మీరు పేటీఎం వాడుతుంటారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్.. ఇక నుంచి ఆ ఛార్జీలు

* సుకన్య సమృద్ధి యోజన (SSY)

ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం ఇది. సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కాలవ్యవధి 21 సంవత్సరాలు. కనిష్టంగా రూ.250 పెట్టుబడితో ఖాతాను తెరవవచ్చు. గరిష్టంగా సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. SSYకి సంబంధించిన కాంట్రిబ్యూషన్.. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, EPFO, National certificate scheme, Nsc, PPF, Ssy, Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు