హోమ్ /వార్తలు /బిజినెస్ /

Employees: ఉద్యోగులకు ప్రభుత్వం మొండి చెయ్యి.. ఈసారి కూడా..

Employees: ఉద్యోగులకు ప్రభుత్వం మొండి చెయ్యి.. ఈసారి కూడా..

ఉద్యోగులకు కేంద్రం మొండి చెయ్యి.. కీలక ప్రకటన!

ఉద్యోగులకు కేంద్రం మొండి చెయ్యి.. కీలక ప్రకటన!

GPF | ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి మొండి చెయ్యి. ఎందుకంటే ప్రభుత్వం ఈసారి కూడా జీపీఎఫ్‌పై వడ్డీ రేటును స్థిరంగానే కొనసాగించింది. సంబంధిత ఇతర స్కీమ్స్‌కు కూడా ఇదే నిర్ణయం వర్తిస్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  PPF | కేంద్రం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించింది. కీలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేశాయి. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) వడ్డీ రేటును స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయి. అలాగే ఇతర స్కీమ్స్‌పై వడ్డీ రేటులో (Interest Rates) మార్పు లేదని పేర్కొన్నాయి. దీని వల్ల ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. జీపీఎఫ్ అనేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లాంటిదనే చెప్పుకోవాలి. ఇది గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  ప్రస్తుత త్రైమాసికానికి సంబంధించి జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సంబంధిత ఇతర స్కీమ్స్‌పై వడ్డీ రేట్లలో మార్పు లేదని తెలిపింది. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కాలానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగానే ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ రేటు అమలులోకి వస్తుంది.

  క్రెడిట్ కార్డ్ మీ వద్ద ఉందా? రూ.25 వేల భారీ డిస్కౌంట్ పొందండిలా!

  కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (సీపీఎఫ్), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్ (ఏఐఎస్‌పీఎఫ్), స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్ (ఎస్‌ఆర్‌పీఎఫ్), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్ (ఐఓడీపీఎఫ్), ఇండియన్ ఆర్డినెన్స్ ప్యాక్టరీస్ వర్క్‌మెన్ ప్రావిడెంట్ ఫండ్, ఇండియన్ నావల్ డక్‌యార్డ్ వర్క్‌మెన్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనెల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి వాటిని అన్నింటికీ ఇదే రేటు వర్తిస్తుంది. రేటులో మార్పు లేదు.

  దసరా, దీపావళి ఆఫర్లు.. ఏకంగా రూ.50,000 తగ్గింపు ప్రకటించిన కంపెనీ

  కాగా జూలై నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో కూడా వీటిపై వడ్డీ రేటు 7.1 శాతంగానేఉంది. అంటే వడ్డీ రేటులో మార్పు లేదు. ప్రభుత్వ ఉద్యోగులు వారి జీతంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో పొదుపు చేసుకోవచ్చు. ఈ మొత్తంపై 7.1 శాతం వడ్డీ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ మొత్తాన్ని పొందొచ్చు.

  కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై కూడా వడ్డీ రేట్లను సవరించింది. పలు పథకాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచితే.. మరికొన్నింటిపై మాత్రం వడ్డీ రేట్లను అలానే స్థిరంగా కొనసాగింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై కూడా వడ్డీ రేటులో మార్పు లేదు. స్థిరంగానే ఉంచింది. 7.1 శాతంగానే కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, కేవీపీ, టైమ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Central govt employees, Employees, Money, Personal Finance, PPF, Savings

  ఉత్తమ కథలు