రిలయెన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్-RRVL లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్-PIF రూ.9,555 కోట్లు (1.3 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడులతో రిలయెన్స్ రీటైల్‌లో 2.04% వాటాలను పొందుతోంది. రిలయెన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్-RRVL విలువ రూ.4.587 లక్షల కోట్లు. ఇందులో 10.09 శాతం వాటాలు అమ్మిన రిలయెన్స్ రీటైల్ రూ.47,265 కోట్ల పెట్టుబడుల్ని స్వీకరించింది. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్-PIF గతంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన డిజిటల్ సర్వీసెస్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మారటోరియం ఎంచుకున్నవారికి శుభవార్త... అకౌంట్‌లో డబ్బులు వేస్తున్న బ్యాంకులు
Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
ఇప్పటికే మరో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీఐసీ ఈ నెలలో రిలయెన్స్ రీటైల్‌లో రూ.5,512.5 కోట్ల పెట్టుబడుల్ని ప్రకటించింది. ఇక మరో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టీపీజీ కూడా రూ.1,837.5 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. రిలయెన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు రిలయెన్స్ రీటైల్ లిమిటెడ్ సబ్సిడరీ. భారతదేశంలో అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న, లాభదాయకమైన రీటైల్ బిజినెస్‌ను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 12,000 స్టోర్లు ఉన్నాయి. 64 కోట్ల కస్టమర్లకు సేవల్ని అందిస్తోంది.
భారత రీటైల్ రంగ దశ, దిశ మార్చాలన్న లక్ష్యంతో రిలయెన్స్ రీటైల్ పనిచేస్తోంది. లక్షలాది మంది రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు-MSMEs సాధికారత ద్వారా కోట్లాది కస్టమర్లకు సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటుంది. తద్వార భారత సమాజానికి అపారమైన ప్రయోజనాలు అందించడంతో పాటు కోట్లాది మందికి ఉపాధి కల్పించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mukesh Ambani, Reliance Industries, Reliance Jio, Reliance JioMart