PUBG Mobile India: నేడు పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ చేస్తారా... ఇవీ వివరాలు

నేడు పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ లాంచ్ చేస్తారా... (ప్రతీకాత్మక చిత్రం)

PUBG Mobile India Latest Update: ఈ పబ్‌జీ మొబైల్ ఇండియా గేమ్ కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.

  • Share this:
    PUBG Mobile India: ఇది వరకు వచ్చిన వార్తల ఆధారంగా దేశవ్యాప్తంగా పబ్‌జీ మొబైల్ ఫ్యాన్స్... మంగళవారం ఈ రాయల్ గేమ్ పబ్‌జీ మొబైల్ ఇండియా లాంచ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే నేడు ఈ గేమ్ ఇండియాలో ప్రారంభమవుతుందా. ఒకవేళ రిలీజ్ అయితే... మొదది రోజే పబ్‌జీ ఫ్యాన్స్ దీన్ని యాక్సెస్ చేయగలరా... ఇలా వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు రాయల్ గేమ్ ఫ్యాన్స్. ఈ పరిస్థితుల్లో జనవరి 19న ఈ గేమ్ ఇండియాలో లాంచ్ అవుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంటే... పబ్‌జీ ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇదివరకు వచ్చిన ట్రైలర్ ప్రాకరం జనవరి 15న ఈ గేమ్ లాంచ్ అవుతుందని అనుకన్నారు. కోట్ల మంది యాక్షన్ లోకి దిగిపోవాలనుకున్నారు.

    జనవరి రెండో లేదా మూడో వారంలో ఈ పబ్జీ మొబైల్ ఇండియా లాంచ్ అవుతుందని రిపోర్టులు కూడా చక్కర్లు కొట్టాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం మాత్రం మార్చి లోపు ఇండియాలో ఈ గేమ్ లాంచ్ కాదని తెలుస్తోంది. ఐతే... యూట్యూబ్‌లో సర్ఫింగ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం... జనవరి 15 నుంచి జనవరి 19 మధ్య ఎప్పుడైనా ఈ గేమ్ లాంచ్ అవుతుందని ఉంది. దానికి తోడు ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఫ్యాన్స్‌లో ఆశలు బాగ పెరిగాయి. దేశవ్యాప్తంగా పబ్జీ లవర్స్... ఆసక్తిగా ఉన్నారు. తిరిగి గేమ్ లాంచ్ అవుతుందనే అంచనాలు కొనసాగుతున్నాయి.

    గతేడాది డిసెంబర్‌లో పబ్‌జీ కార్పొరేషన్ రెండు కీలక ప్రకటనలు చేసింది. అవి ఇండియాలోని పబ్ జీ ప్రేమికులకు ఆశలు పెంచాయి. దీని మాతృ కంపెనీ క్రాఫ్టన్ ఇన్కార్పొరేషన్... ఇండియాకి ఈమధ్య అనీష్ అరవింద్ అనే కొత్త మేనేజర్‌ను నియమించింది. దాంతో... ఈ గేమ్ తిరిగి ప్రారంభమవుతుందనే అంచనాలు పెరిగాయి. మీడియా రిపోర్టుల ప్రకారం... క్రాఫ్టన్ ఇన్‌కార్పొరేషన్... మరో నలుగురిని కూడా నియమించబోతున్నట్లు తెలిసింది. వీరంతా టెన్సెంట్‌ (Tencent)లోని వారేనని తెలుస్తోంది. ఈ టెన్సెంట్ కంపెనీ... పబ్‌జీ మొబైల్ గ్లోబల్ వెర్షన్ హక్కులు కలిగివుంది.

    ఈ గేమ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది అనే అంశంపై పబ్‌జీ కార్పొరేషన్, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటనా రిలీజ్ చెయ్యలేదు. ఐతే... ఈలోగా FAU-G (Fearless and United Guards) యాక్షన్ గేమ్ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ గేమ్ పైనా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

    ఇది కూడా చదవండి: Horoscope Today: జనవరి 19 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగావకాశాలు

    మీకు తెలిసే ఉంటుంది. గత సంవత్సరం సెప్టెంబర్ 2న పబ్‌జీని కేంద్రం... 118 చైనా మొబైల్ యాప్స్‌తోపాటూ నిషేధించింది. ఈ యాప్స్ దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పింది. రూల్స్ పాటించట్లేదని తెలిపింది. ఇక అప్పటి నుంచి భారతీయులకు పబ్‌జీ గేమ్ దూరమైంది.
    Published by:Krishna Kumar N
    First published: