హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: హోమ్​ లోన్ ద్వారా పన్ను మినహాయింపు.. ఈ పత్రాలు చాలా ముఖ్యం

Home Loan: హోమ్​ లోన్ ద్వారా పన్ను మినహాయింపు.. ఈ పత్రాలు చాలా ముఖ్యం

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఈ బ్యాంక్ 6.8 శాతం RLLRతో గృహ రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు గృహ రుణంపై కనిష్టంగా 6.4 శాతం మరియు గరిష్టంగా 7.8 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది ప్రభుత్వ రంగంలోని ప్రముఖ రుణదాతలలో ఒకటి. మీ CIBIL స్కోర్ బాగుంటే.. మీరు వీలైనంత తక్కువ రేటుకు హోమ్ లోన్ పొందుతారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఈ బ్యాంక్ 6.8 శాతం RLLRతో గృహ రుణాన్ని అందిస్తోంది. బ్యాంకు గృహ రుణంపై కనిష్టంగా 6.4 శాతం మరియు గరిష్టంగా 7.8 శాతం వడ్డీని ఇస్తోంది. ఇది ప్రభుత్వ రంగంలోని ప్రముఖ రుణదాతలలో ఒకటి. మీ CIBIL స్కోర్ బాగుంటే.. మీరు వీలైనంత తక్కువ రేటుకు హోమ్ లోన్ పొందుతారు.

Home Loan: హోమ్​లోన్​పై లభించే ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మీరు చెల్లించిన అసలు, వడ్డీలపై ట్యాక్స్ మినహాయింపు కోరేందుకు ఏమేం డాక్యుమెంట్స్​ అవసరమరవుతాయో తెలుసుకోవాలి.

సొంతింటి కల నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చేతిలో తగినంత డబ్బు ఉండక చాలా మంది బ్యాంకుల్లో హోమ్​లోన్​ తీసుకుంటారు. హోమ్​లోన్​ తీసుకునే ముందు కస్టమర్లు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా హోమ్​లోన్​పై లభించే ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. మీరు చెల్లించిన అసలు, వడ్డీలపై ట్యాక్స్ మినహాయింపు కోరేందుకు ఏమేం డాక్యుమెంట్స్​ అవసరమరవుతాయో తెలుసుకోవాలి. వీటిలో ముఖ్యమైనది ప్రొవిజినల్ సర్టిఫికేట్​. ఇది మనం బ్యాంకుకు చెల్లించిన అసలు, వడ్డీపై లభించే ట్యాక్స్ మినహాయింపులకు ప్రూఫ్​గా పనిచేస్తుంది. ఈ ప్రొవిజినల్​ సర్టిఫికేట్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

హోమ్​లోన్​ ప్రొవిజినల్​ సర్టిఫికేట్​​ అంటే ఏంటి?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీరు బ్యాంకుకు చెల్లించిన అసలు, వడ్డీల స్టేట్​మెంట్​గా ఇది పనిచేస్తుంది. హోమ్​లోన్​ తీసుకున్న బ్యాంకు నుంచి ఈ సర్టిఫికేట్​ను పొందాల్సి ఉంటుంది.

ప్రొవిజినల్ సర్టిఫికేట్​ ఉపయోగాలు

ఈ సర్టిఫికెట్ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలను పొందడానికి ఉపయోగపడుతుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం.. హోమ్​లోన్ కింద చెల్లించిన అసలు​పై రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అలాగే సెక్షన్ 24 (బి) ప్రకారం.. మీరు చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ ప్రొవిజినల్​ సర్టిఫికెట్​ను కస్టమర్లు తమ ఎంప్లాయర్​ లేదా కంపెనీ యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది.

మారిటోరియంను ప్రొవిజినల్​ సర్టిఫికెట్​లో పేర్కొవాలా?

కరోనా కారణంగా ఆర్​బీఐ మారటోరియం వెసులుబాటును కల్పించింది. దీన్ని ఎంచుకున్న వారు ఈఎంఐలను సకాలంలో చెల్లించనందున, వారికి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా తక్కువగా ఉంటాయి. సెక్షన్ 80 సి ప్రకారం పూర్తిగా ట్యాక్స్ ప్రయోజనాలు పొందాలంటే సకాలంలో బ్యాంకుకు పూర్తిగా ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో కస్టమర్ల ట్యాక్స్ ప్రయోజనాలు తగ్గుతాయి. మారిటోరియంను ఎంచుకున్నప్పటికీ సెక్షన్ 24 (బి) ప్రకారం, మీకు వర్తించే వడ్డీ మొత్తంపై ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది.

జాయింట్ అకౌంట్ తీసుకుంటే ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుందా?

జాయింట్ అకౌంట్​తో ప్రొవిజినల్ సర్టిఫికేట్​ తీసుకున్న వారు కూడా టాక్స్​ బెనిఫిట్స్​ పొందవచ్చు. కానీ జాయింట్ అకౌంట్ హోల్డర్ కూడా కస్టమర్లు కొనుగోలు చేసిన ఆస్తికి సహ యజమానిగా ఉండాలి. జాయింట్​ హోమ్​ లోన్​ విషయంలో, ఇద్దరు యజమానుల మధ్య వారి యాజమాన్యం నిష్పత్తి ఆధారంగా మొత్తం వడ్డీని విభజిస్తారు. ఒకవేళ ఆస్తిలో వాటా శాతం ఎంత అనేది లేకపోతే.. EMIలను సమానంగా విభజిస్తారు.

ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ పొందగలమా?

ఆన్​లైన్​లోనూ ప్రొవిజినల్​ సర్టిఫికేట్ పొందవచ్చు. ప్రస్తుతం, ఎక్కువ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇందుకు గాను మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వండి. తర్వాత హోమ్​లోన్​ అకౌంట్​ నంబర్​, పుట్టిన తేదీ, లోన్​ మొత్తం, EMI మొత్తాలను ఎంటర్​ చేయండి. అప్పుడు మీరు మీ గృహ రుణానికి సంబంధించిన ప్రొవిజినల్​ సర్టిఫికెట్​ను చూడవచ్చు. మీరు మీ బ్యాంక్ మొబైల్ యాప్​తో కూడా దీన్ని యాక్సెస్​ చేయవచ్చు.

ఆఫ్‌లైన్‌లో కూడా..

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, మీ సమీపంలోని బ్యాంక్ శాఖను సందర్శించండి. అక్కడ మీ రిక్వెస్ట్​ ఫారమ్ నింపాలి. ఆధార్, పాన్ లేదా పాస్‌పోర్ట్ కాపీలతో పాటు ఇతర డాక్యుమెంట్స్​ను జతచేసి మీ ఫారమ్‌ను బ్యాంకుకు సమర్పించండి. కొన్ని బ్యాంకులు తమ టోల్ ఫ్రీ నంబర్, కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా తాత్కాలిక ధ్రువీకరణ పత్రాన్ని పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఈ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పొందడానికి ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

First published:

Tags: Home loan

ఉత్తమ కథలు