హోమ్ /వార్తలు /బిజినెస్ /

Provident Fund: ఈపీఎఫ్‌ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఎలా కంప్లైంట్‌ చేయాలి..? ఈ సింపుల్‌ గైడెన్స్‌ మీ కోసమే..

Provident Fund: ఈపీఎఫ్‌ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఎలా కంప్లైంట్‌ చేయాలి..? ఈ సింపుల్‌ గైడెన్స్‌ మీ కోసమే..

Provident Fund: ఈపీఎఫ్‌ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఎలా కంప్లైంట్‌ చేయాలి..? ఈ సింపుల్‌ గైడెన్స్‌ మీ కోసమే..

Provident Fund: ఈపీఎఫ్‌ సమస్యలపై ఆన్‌లైన్‌లో ఎలా కంప్లైంట్‌ చేయాలి..? ఈ సింపుల్‌ గైడెన్స్‌ మీ కోసమే..

Provident Fund: EPF సంబంధిత కంప్లైంట్స్‌ చేయడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (EPFIGMS)ను ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్‌ తర్వాత వృద్ధాప్యంలో తమ అవసరాలను తీర్చుకునేందుకు రెండు రకాల పదవీ విరమణ పథకాలపై ఆధారపడతారు. ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF), మరొకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS). ఈ రెండు పథకాలను పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఈ స్కీమ్స్‌ ద్వారా సబ్‌స్క్రైబర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే EPF సంబంధిత కంప్లైంట్స్‌ చేయడానికి, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (EPFIGMS)ను ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకొచ్చింది.

EPFIGMS అనేది EPFO ​​అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి EPFO అందుబాటులోకి తీసుకొచ్చిన పోర్టల్. గ్రీవెన్స్‌లను ఏ ప్రదేశంలోనైనా దాఖలు చేయవచ్చు. ఆ ఫిర్యాదులు సంబంధిత ఆఫీస్‌కు చేరుతాయి. EPFO పోర్టల్ వివరాల ప్రకారం.. ఫిర్యాదులను న్యూఢిల్లీలోని హెడ్‌ ఆఫీస్‌కి లేదా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 135 ఫీల్డ్ ఆఫీసులకు పంపవచ్చు. EPFiGMS పోర్టల్ సబ్‌స్క్రైబర్లకు ఓపెన్‌ కంప్లైంట్స్‌, రిక్వెస్ట్స్‌ స్టేటస్‌ తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. EPF-సంబంధిత ఫిర్యాదును PF సభ్యుడు, EPS పెన్షనర్, యజమాని, ఇతరులు చేయవచ్చు.

* ఎలా కంప్లైంట్‌ చేయాలి?

ముందు EPF i-Grievance Management System (https://epfigms.gov.in/) అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. అక్కడ హోమ్‌ పేజీలో ‘రిజిస్టర్ గ్రీవెన్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీకు వర్తించే 'స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోండి.

తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ఎంటర్‌ చేయండి. సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత ‘గెట్‌ మోర్‌ డీటైల్స్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

ఇక్కడ UAN వివరాలు డిప్‌స్లే అయిన చోట 'గెట్‌ OTP' బటన్‌పై క్లిక్ చేయండి. రిజిస్టెర్డ్‌ మొబైల్‌ నంబర్‌కి వచ్చిన OTPని ఎంటర్‌ చేసి, ‘సబ్మిట్‌’ బటన్‌పై క్లిక్‌ చేయండి.

దీంతో OTP వెరిఫికేషన్‌ మెసేజ్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రాసెస్‌ కొనసాగించడానికి ‘Ok’ బటన్‌పై క్లిక్‌ చేయండి.

అనంతరం పేరు, జెండర్‌, కాంటాక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌, పిన్ కోడ్, రాష్ట్రం, దేశం వంటి వ్యక్తిగత వివరాలను ఎంటర్‌ చేయాలి చేయండి. ‘గ్రీవెన్స్ డీటైల్స్‌’ కాలమ్‌లోని PF అకౌంట్‌ నంబర్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు కంప్లైంట్‌ డిస్క్రిప్షన్‌తోపాటు కంప్లైంట్‌ టైప్‌ని సెలక్ట్‌ చేయండి. ‘చూస్‌ ఫైల్‌’, ‘అటాచ్‌’ బటన్‌ల ద్వారా కంప్లైంట్‌కి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయండి.

ఫిర్యాదుల సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత, సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయండి. ఆ తర్వాత ‘యాడ్‌’ బటన్‌పై క్లిక్ చేయండి. ఫిర్యాదు ‘గ్రీవెన్స్ డిటైల్స్’ పేరుతో ఉన్న ప్లేస్‌ పోస్ట్ అవుతుంది.

ఇది కూడా చదవండి : బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా 5 రోజులు సెలవులు.. ఎప్పటినుంచంటే?

EPFOకి ఫిర్యాదును ఫైల్ చేయడానికి, ‘సబ్మిట్‌’ బటన్‌ను క్లిక్ చేయండి. ఫిర్యాదు నమోదైన తర్వాత, EPF సబ్‌స్క్రైబర్లకు రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఇమెయిల్, SMS వస్తుంది.

* EPF కంప్లైంట్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి?

కంప్లైంట్‌ స్టేటస్‌ తెలుసుకోవడానికి https://epfigms.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయండి. అక్కడ ‘వ్యూ స్టేటస్‌’ బటన్‌ను క్లిక్ చేయండి.

ఈ విండోలో రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. కొన్నిసార్లు కంప్లైంట్‌ నంబర్, కంప్లైంట్‌ పాస్‌వర్డ్, మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రెస్‌, సెక్యూరిటీ కోడ్‌ అవసరం అవుతాయి.

చివరిగా సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి. మీ కంప్లైంట్‌ స్టేటస్‌ కనిపిస్తుంది.

First published:

Tags: EPFO, Pensions, Personal Finance

ఉత్తమ కథలు