హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock Market: హుషారు నుంచి బేజారు...50 వేల పాయింట్ల మార్కును తాకి పతనం...

Stock Market: హుషారు నుంచి బేజారు...50 వేల పాయింట్ల మార్కును తాకి పతనం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. అయినప్పటికీ మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకాయి. గురువారం మార్కెట్ ఓపెనింగ్ లో సెన్సెక్స్ 50,096.57 పాయింట్లతో ప్రారంభమై తొలిసారి 50 వేల మార్కును అందుకుంది.

  స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. అయినప్పటికీ మార్కెట్లు కొత్త గరిష్టాలను తాకాయి. గురువారం మార్కెట్ ఓపెనింగ్ లో సెన్సెక్స్ 50,096.57 పాయింట్లతో ప్రారంభమై తొలిసారి 50 వేల మార్కును అందుకుంది. అంతేకాదు 50,184.01 పాయింట్ల వద్ద ఆల్ టైం రికార్డును అందుకుంది. అయితే క్లోజింగ్ సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీలు ఆ రేంజ్ ను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో జనవరి 21 న సూచీలు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో నిఫ్టీ తాజా గరిష్ట స్థాయి 14,753.55 ను సాధించింది. సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 49,624.76 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు లేదా 0.37 శాతం తగ్గి 14,590.35 వద్ద ముగిసాయి.

  టాప్ గెయినర్స్ గా Tata Motors Ltd.(+5.71 %),Bajaj Finance L (+2.74 %), Reliance Inds.(+2.18 %), Bajaj Auto Ltd. (+1.63 %), Eicher Motors (+1.56 %)

  టాప్ లూజర్లుగా ONGC (-4.20 %), Tata Steel

  (-3.40 %), GAIL (India) Ltd.(-3.08 %), Coal India

  (-2.93 %), SBI (-2.55 %) నిలిచాయి.

  అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో మార్కెట్ సూచీలు ఆల్‌టైం హై రికార్డులను నమోదుచేశాయి. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకరణ తర్వాత ఏర్పడే కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చనే ఆశలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. కోవిడ్‌–19 సంక్షోభంతో కష్టాల్లో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని కొత్తగా ఎన్నికైన యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ జన్నెట్‌ యెల్లన్‌ ప్రకటన కూడా ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి రెండోరోజూ బలపడటం, కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసికపు ఫలితాలు అంచనాలకు మించి నమోదు కావడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి దేశీయ పరిణామాలు మార్కెట్‌లలో జోష్ నింపాయి. అయితే చివర్లో

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Stock Market

  ఉత్తమ కథలు